అడ్డంగా దొరికిన బాబు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-24 15:26:23

అడ్డంగా దొరికిన బాబు

ఇది ఆసక్తికరమైన విషయం నిన్న జ‌రిగిన కర్ణాటక సీఎం కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవంలో ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేతే చంద్ర‌బాబు నాయుడు ఆస‌క్తిక‌రంగా మారారు. కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీల‌ ముఖ్య‌మంత్రులు, నాయ‌కులు హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మానికి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కూడా హాజ‌ర‌య్యారు. 
 
1995లో చంద్ర‌బాబు మొద‌టిగా ముఖ్య‌మంత్రి అయిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ ఏ కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రు అయినా, ఏ స‌భ‌కు వెళ్లినా ఆయ‌న ప్ర‌సంగించే ముందు ప్ర‌జ‌ల‌కు త‌న విజ‌య ప‌థ‌కం అయిన రెండు వేళ్లతో టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను ముచ్చ‌టించి ఆ త‌ర్వ‌తా త‌న త‌దుప‌రి కార్య‌క్ర‌మాన్ని మొద‌లు పెడ‌తారు చంద్ర‌బాబు నాయుడు. కానీ ఊహించ‌ని ప‌రిణామల నేప‌థ్యంలో త‌న విజ‌యసంకేతం అయిన రెండు వేళ్ల‌ను చూపించ‌కుండా ఈ సారి వెరైటీగా చూపించి రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఆర్చ‌ర్య‌ప‌రిచారు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.
 
రెండు వేళ్ల‌తో కాకుండా ఇంకేలా ప్ర‌జ‌ల‌ను ఆర్చ‌ర్య‌పరిచాడా !అని దీర్ఘంగా ఆలోచిస్తున్నారా, నిన్న జ‌రిగిన క‌ర్ణాట‌క  సిఎం కుమారస్వామి ప్రమాణం స్వీకారం ముగిసిన త‌ర్వాత కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కురాలు, అలాగే పార్టీ అధినేత రాహుల్ గాందీ పక్కన చంద్ర‌బాబు నిలబడి రెండు వేళ్లుతో కాకుండా  కాంగ్రెస్ పార్టీ హ‌స్తం గుర్తుతో ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. దీంతో చంద్ర‌బాబు హ‌స్తంతో ప్ర‌జ‌ల‌ను ప‌లక‌రించ‌డంతో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఈ వీడియో వైర‌ల్‌ అవుతోంది. గ‌తంలో టీడీపీ కాంగ్రెస్ పార్టీని బ‌ద్ద శ‌త్రువుగా వ్య‌వ‌హ‌రించి ఇప్ప‌డు రాహూల్ స‌మ‌క్షంలో చంద్ర‌బాబు  హ‌స్తంతో ప్ర‌జ‌ల‌ను ప‌లుకరిస్తున్నారా అని పెద్ద ఎత్తున నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.