బాబు టీడీపీ సిద్దాంతాల‌ను గంగ‌లో క‌లిపారు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu naidu
Updated:  2018-09-08 12:21:29

బాబు టీడీపీ సిద్దాంతాల‌ను గంగ‌లో క‌లిపారు

తెలంగాణ‌లో రాజ‌కీయ ప‌రిణామాలు వేంగంగా మారుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ను ఓడించ‌డ‌మే ల‌క్ష్యంగా విప‌క్ష పార్టీ వ్యూహర‌చ‌న చేస్తున్నాయి. సిద్దాంతాలు రాద్దాంతాల‌ను ప‌క్క‌న‌పెట్టి ఏకం కావ‌డానికి అన్నిఅవ‌కాశాలను ప‌రిశీలిస్తున్నాయి. మ‌హాకుట‌మి దివ‌గా అడుగులు వేస్తూ కారు పార్టీని భ‌లంగా డీ కోట్ట‌డానికి అన్ని పార్టీలు రెడీ అవుతున్నాయి. 
 
అయితే ఈ కోవ‌లోనే ఊహించ‌ని రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు కూడా తెర‌పైకి వ‌స్తున్నాయి. నాటి నుంచి నేటివ‌రకు బ‌ద్ద‌శ‌త్రువులు అయిన పార్టీలు  పొత్తుల దిశ‌గా ప్ర‌య‌నిస్తున్నాయి. టీడీపీ, సీపీఐ, టీజేఎస్, పార్టీల‌తో మ‌హాకుట‌మిని ఏర్పాటు చెయ్యాల‌నే అలోచ‌న‌లో కాంగ్రెస్ పార్టీ ఉన్న‌ట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ రోజు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుతో సంప్ర‌దింపులు జ‌రుప‌నుంది హ‌స్తం పార్టీ. 
 
అంతేకాదు ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవాల‌ని ఇప్ప‌టికే అంగీకారానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ ప్ర‌స్తుతం తెలంగాణ‌లో అదేపార్టీతో పొత్తుపై ఎలాంటి ప‌రినామాలను ఎదుర్కోవాల్సి వ‌స్తుందనే అంశాల‌పై, అలాగే ఎన్నిక‌ల్లో పొత్తువ‌ల్ల లాభ‌న‌ష్టాల‌పై పొలిల్ బ్యూరో స‌భ్యులు ముఖ్య‌ నేత‌ల‌తో స‌మావేశం అయి చ‌ర్చించ‌నున్నారు. 
 
చంద్ర‌బాబుతో క‌లిసి వ‌చ్చే పార్టీలు పొత్తులు సీట్లు స‌ర్దుబాట్లు  చేసుకోవాల్సిందిగా నేత‌ల‌కు దిశానిర్ధేశం చేయ‌నున్నారు. అంతేకాదే ఇదే పొత్త‌ల‌పై ఏపీ మంత్రుల‌పై చంద్ర‌బాబు ఇప్ప‌టికే చ‌ర్చించారు. అయితే వారిలో ఇప్ప‌టికే కొంద‌రు మంత్రులు వ్య‌తిరేకించిన‌ప్ప‌టికి తెలంగాణ‌లో రాజ‌కీయ ప‌రిస్థితులు కేసీఆర్‌ ఎదుర్కోవ‌డానికి అన్ని పార్టీలన్ని సుదీర్ఘంగా చ‌ర్చించిన త‌ర్వాత వారినుంచి సానుకూలంగా స్పంద‌న వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.