సీఎం చంద్ర‌బాబు ఆ ప్ర‌క‌ట‌న చేస్తే 45 గ్రాఫ్ డౌన్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-03 12:12:12

సీఎం చంద్ర‌బాబు ఆ ప్ర‌క‌ట‌న చేస్తే 45 గ్రాఫ్ డౌన్

25 ఏళ్లు అధికారం చేప‌ట్టిన జ్యోతిబ‌సు, జాతీయ పార్టీల‌ను జాతీయ పార్టీ నాయ‌కుల‌ను ఎదుర్కొన్న మ‌మ‌తా, అస‌లు దేశ రాజ‌కీయాల్లో సీనియ‌ర్ అంటే ఆయ‌న పేరే చెప్పాలి అంటారు.. రాజ‌కీయ ఆస్కార్ అవార్డ్ ఇవ్వాలి ఆయ‌న‌కు, రాజ‌కీయ బీష్మ అయిన కురుణానిధి కూడాచెప్పుకోరు  అయామ్ మోస్ట్ సీనియర్ ఇన్ పాలిటిక్స్ అని.. కాని ఏపీ సీఎం చంద్ర‌బాబు మాత్రం అయామ్ దేశంలో సీనియ‌ర్ పొలిటిషియ‌న్ అని చెబుతారు.. 

వినేవాడు ఉంటే ఎమైనా చెబుతారు అని చెప్పిన‌ట్టు , ఇచ్చినే హామ‌లు నెర‌వేర్చిన త‌ర్వాతే  ఎన్నిక‌ల్లో పోటీకి నిల‌బ‌డాలి అని సునీల్  మ‌ల్హోత్రా  గ‌తంలో యూపీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌చారం కూడా చేశాడు...కాని మీడియాలు కూడా అత‌నిగొంతు వినిపించేలా చేయ‌లేదు.. చాలా వ‌ర‌కూ మీడియాలు రాజ‌కీయ పార్టీలకు  స‌పోర్ట్  కాబ‌ట్టి సునీల్ ప‌రిస్దితి ఇంటికి ప‌రిమితం అయింది.

అయితే గ‌త ఎన్నిక‌ల్లో సీఎం చంద్ర‌బాబు ఇచ్చిన ఓ పెద్ద హామీ ఏమిటి అంటే కాపుల‌ను బీసీల్లో చేరుస్తా అని...ఆ త‌ర్వాత చెప్పి పెద్ద‌హామీ నిరుద్యోగ భృతి.. అస‌లు ఆర్ధికశాఖ అధికారులు మేధావుల‌తో చ‌ర్చించ‌కుండా ఇచ్చిన హామీ నిరుద్యోగ భృతి అని విమర్శ‌లు వ‌స్తున్నాయి.. ఇది ఎంత అంటే మ‌న బ‌డ్జెట్ లో 30 శాతం కేటాయిస్తే కాని నిరుద్యోగ భృతి చెల్లించ‌లేం.. మ‌రిఇలాంటి హామీ ఎలా ఇచ్చారు.. అస‌లు లెక్క‌లు ఈక్వేష‌న్లు లేకుండానే ఇచ్చారు అన‌డానికి స్ప‌ష్ట‌మైన ఉదాహ‌ర‌ణ‌గా దీనిని చెప్ప‌వ‌చ్చు. అస‌లు రాష్ట్ర ప్ర‌భుత్వం ఇచ్చిన హామీకి కేంద్రంఎందుకు నిధులు ఇస్తుంది ఇది వీరి రాజ‌కీయ స్వార్ధం కాబ‌ట్టి కేంద్రంలో ఏ పార్టీ కూడా ఇలాంటి వాటిని నిధులు ఇచ్చే ఆస్కారం లేదు.

అయితే నిరుద్యోగ భృతి కూడా ఏదో ట్రైన‌ర్స్ కి ఇచ్చే స్టైఫండ్ లా, 1000 లేదా 500 ఇచ్చేలా ఉన్నారు.. దానికి కూడా యూపీపీఎస్సీ ఎన్ని క‌ఠిన ప‌రీక్ష‌లు పెడుతోందో, అన్నీ కండిష‌న్లు ఉన్నాయి.. మ‌రి ఇప్పుడు తెలుగుదేశం అధినేత కాపులకు ఇచ్చిన హామీ పై ఓటు బ్యాంకు కోసం ప్ర‌క‌ట‌న చేస్తే కాపుల ఓట్లు తెలుగుదేశానికి అనుకూలంగా ప‌డ‌తాయో లేదో తెలియ‌దు కాని, ఏనాటి నుంచో క‌ట్టుకున్న బీసీ ఓటు బ్యాంక్ మొత్తం బాబుకు దూరం అవుతుంది..

ఏకంగా బీసీ ఓటు బ్యాంకు మొత్తం టీడీపీ నుంచి దూరం అయినా ఆశ్చ‌ర్య‌పోవ‌క్క‌ర్లేదు..ఆర్ కృష్ణ‌య్య తెలంగాణ‌లో ఉన్నా ఏపీలో ఆయ‌న అనుచ‌రులు ఇక్క‌డ బాబు స్టెప్ బ‌ట్టీ పావులు క‌దుపుతారు. ఇలాంటి ప‌రిస్దితుల్లో ఆయ‌న కాపుల విష‌యంలో ఎటువంటి నిర్ణ‌యం తీసుకోలేరు... నిజ‌మే జ‌గ‌న్ కూడా కాపుల విష‌యంలో అందుకే కాస్త వెన‌క‌డుగువేస్తున్నారు అన‌డంలో ఎటువంటి సంకోచం లేదు పార్టీ త‌ర‌పున, వైసీపీనాయ‌కుల‌కు కూడా.

మ‌రి నిజంగా ఆ రిజ‌ర్వేష‌న్ల గురించి మ‌ళ్లీ కేంద్రం ఏపీలో పాగా వేయాలి కాబ‌ట్టి ఆ క‌మిష‌న్  కాదు అని కొత్త క‌మిష‌న్ వేసినా చెప్ప‌లేము.. ఈ వివాదం కోర్టులో తేల్చుకోవాలి అని మ‌ళ్లీ వెన‌క్కి పంపినా క‌థ ముందుకు వ‌స్తుంది.. అందుకే కేంద్రం కూడా దీనిపై తెలుగుదేశం అధినేత అడిగితే చూద్దాం అని కాచుకు కూర్చుంది.. ఒకవేళ కేంద్రం త‌నంత‌ట తానుగా ముందుకు వ‌స్తే ఆ క్రెడిట్ బీజేపీకి వ‌చ్చేలా చేస్తారు క‌మ‌లం పార్టీ  రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా....సో ఎలా అయినా టీడీపీకి ఇక్క‌డ మైన‌స్..ఈ ప్ర‌క‌ట‌న చేస్తే టీడీపీకి బీసీ ఓటు బ్యాంకు సుమారు 45 శాతం గ్రాఫ్ డౌన్ అవుతుంది అంటున్నారు కొంద‌రు సొంతగూటి నేత‌లు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.