టీడీపీ ఓటమి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-18 16:14:52

టీడీపీ ఓటమి

ఏపీ విష‌యానికి వ‌స్తే, అధికార తెలుగుదేశం పార్టీపై ప్ర‌జ‌ల్లో ఎంత వ్యతిరేఖత ఉందో అందరికి తెలిసిందే. ఈ వ్యతిరేఖతకి కారణం 2014 ఎన్నికల టీడీపీ మానిఫెస్టోలో ఉన్న హామీలే అని కూడా అందరికి తెలిసిందే. చంద్రబాబు ఇచ్చిన అన్‌లిమిటెడ్ హామీలలో నాలుగేళ్లు గడిచిన ఏ ఒక్కటి నెరవేర్చలేదు. అందుకే ప్రజల మధ్య తిరగడానికి కూడా భయపడుతున్నారు టీడీపీ నాయకులు.
 
రైతులకు రుణమాఫీ, ఇక మ‌హిళ‌ల‌కు సెల్ ఫోన్లు, విద్యార్ధుల‌కు లాప్ టాప్ లు, నిరుద్యోగుల‌కు భృతి, ఉద్యోగాలు, సంత్స‌రానికి ఓ సారి డీఎస్సీ, పేద‌లంద‌రికీ గృహ‌నిర్మాణాలు, ఎన్టీఆర్ సుజ‌ల స్ర‌వంతి,.....అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే స‌మ‌యం స‌రిపోనంత‌గా హామీలు గుప్పించారు చంద్ర‌బాబు. ఇక అధికారంలోకి వచ్చాక టీడీపీ ప్రభుత్వం చేస్తున్నవి చూస్తే...రాష్ట్రాన్ని అవినీతిలో ముందుంచడం, ఇసుక నుండి మట్టి వరకు దోచుకోవడం, మహిళలపై హత్యచారాలు, బోటు ప్రమాదాలు ఇలా ఒకటా, రెండా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది.
 
ఇక టీడీపీ మ్యానిఫెస్టోను ప్రజలు ఎక్కడ చూస్తారో అని చెప్పి, టీడీపీ అఫిషియ‌ల్ వెబ్ సైట్లో నుండి కూడా తీసేశారు..గత ఆరు నెలలుగా ప్రజాసంకల్ప పేరుతో ప్రతిపక్ష నేత ప్రజల మధ్యనే ఉంటూ, ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి..పాదయాత్రలో ఒకవైపు ప్రజల సమస్యలను తెలుసుకుంటూనే, గత ఎన్నికల్లో టీడీపీ ఆయుధంగా వాడిన అన్ లిమిడెట్ హామీల మేనిఫోస్టోను అస్త్రంగా చేసుకొని ముందుకు వెళ్తున్నారు జగన్.
 
టీడీపీ మేనిఫోస్టోను చ‌దివి ఇందులో ఏ ఒక్క‌టైనా అమలు చేశారా అంటూ ప్రజలను అడుగుతూ ముందుకు సాగుతున్నారు జగన్. టీడీపీ ఇచ్చిన ఒక్కో హామీకి ఒక్కో కథ చెప్తూ, టీడీపీ చేస్తున్న మోసాలను ఎండగడుతున్నారు. ఇలా బాబు హామీల వైఫ‌ల్యాల‌ను వివ‌రిస్తూ...ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ....వైసీపీ అధికారంలోకి వ‌స్తే అమలు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాల ప‌థ‌కాల‌ను తెలియజేస్తూ జ‌గ‌న్ పాద‌యాత్ర‌ను కొన‌సాగిస్తున్నారు.ఈ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.
 
గ‌త ఎన్నిక‌ల్లో నెగ్గేందుకు బాబు ప్ర‌క‌టించిన మేనిఫోస్టో ఇప్పుడు జ‌గ‌న్ కి అస్త్రంగా మారుతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. రాజ్యాంగానికి విరుద్ధంగా, వైసీపీని దెబ్బ తీయడానికి ఫిరాయింపులను ప్రోత్సహించింది టీడీపీ.. అయితే ఆ ఫిరాయింపుల ఎఫెక్ట్ కూడా వచ్చే ఎన్నికలలో టీడీపీపైన పడుతుంది అంటున్నారు.. ఎందుకంటే చాలా చోట్ల ఫిరాయింపు ఎమ్మెల్యేలకు, టీడీపీ నాయకులకు పొసగడంలేదు...దీంతో రెండు వర్గాలుగా విడిపోయారు..వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓటమికి ఏదో ఒక వర్గం పాటుపడుతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ రెండు కారణాల వాళ్ళ 2019 లో టీడీపీ ఓడిపోవడం ఖాయం అని అంటున్నారు మేధావులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.