ఏపీ పై అద్వాణీ ఏమ‌న్నారంటే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-10 02:27:50

ఏపీ పై అద్వాణీ ఏమ‌న్నారంటే

కాషాయ‌వాదం ఎలా ఉన్నా క‌మ‌లం పార్టీ గురించి చెప్ప‌గానే  మాజీ ప్ర‌ధాని వాజ్ పేయ్, లాల్ కృష్ణ అద్వాణీ పేర్లు గుర్తు వస్తాయి.. దేశంలో కాషాయం రెప‌రెప‌లాడేలా చేసిన ఉద్దండ రాజ‌కీయ నాయ‌కులు ఇరువురు ..2004-2009 ఎన్నిక‌ల్లో అద్వాణీ ప్ర‌ధాని అభ్య‌ర్ధి అని దేశంలో ఎన్నిక‌ల్లో ముందుకు వెళ్లింది బీజేపీ...అయితే రెండు ఎన్నిక‌ల్లో ఫెయిల్ అయింది. దీంతో శిష్య బృందంలో మోదీ క‌రెక్ట్ అని అంద‌రూ ఆమోదించారు... అయితే మోదీ అభ్య‌ర్ధిత్వం పై ఎటువంటి ప్ర‌క‌ట‌న అద్వాణీ చేయ‌లేదు, అయినా వార‌ణాసి కాశీ విశ్వేశ్వ‌రుని సాక్షిగా ప్ర‌ధాని అయ్యారు మోదీ అంటారు బీజేపీ ఫాలోవ‌ర్స్.
 
దేశంలో అన్ని రాష్ట్రాల్లో అన్ని పార్టీల‌తో మిత్ర వైఖ‌రితో పాటు మిత వైఖ‌రి అనుస‌రించ‌డం అద్వాణీ స్టైల్.. కాని అద్వాణీ ప్ర‌ధాని ప‌ద‌వి వ‌ద్ద‌న్నారు 2014 ఎన్నిక‌ల్లో... అలాగే త‌దుప‌రి  రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి పై ఆశ‌లేదు అని చెప్పారు... దీంతో ఆయ‌న పై మ‌రింత ప్రేమ - ఆప్యాయ‌త క‌మ‌ల‌ద‌ళానికి పెరిగింది.. ఆయ‌న‌కు ఏపీ అన్నా ఏపీ నుంచి వ‌చ్చే నాయ‌కులు అన్నా అమిత అభిమానం, అందుకే ద‌క్షిణాది రాష్ట్రాల్లో బీజేపీని ఇక్క‌డ మ‌రింత జ‌నంలోకి తీసుకువెళ్లాలి అని భావించేవారు. ఏపీ విభ‌జ‌న స‌మ‌యంలో గొంతెత్తి న్యాయం చేయాలి అని కాంగ్రెస్ పై ఫైట్ చేసిన నాయ‌కుల్లో ఆయ‌న ఒక‌రు.
 
అయితే ఏపీకి తాజాగా జ‌రుగుతున్న అన్యాయం పై ఆయ‌న త‌న గొంతు విప్పారు..  బీజేపీకి ఎప్ప‌టి నుంచో తెలుగుదేశం మంచి మిత్ర‌ప‌క్షం అని అన్నారు... ప్ర‌భుత్వంలో భాగంగా ఉన్న వారిపై ఇటువంటి దోర‌ణి ఉండ‌కూడ‌దని,. పొత్తులో ఉన్నారు కాబ‌ట్టి ఇరువురు స‌హ‌క‌రించుకోవాలి - ప‌ర‌స్ప‌రం గౌర‌వించుకోవాలి అని తెలిపారు. అయినా తాను ఎవ‌రికి స‌ల‌హాలు సూచ‌న‌లు ఇవ్వ‌న‌ని  ఆవేద‌న‌గా చెప్పారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.