ఇదే సీక్రెట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-09 19:06:52

ఇదే సీక్రెట్

అమ‌రావ‌తి అంకురార్ప‌ణ‌కు సాక్షాత్తు ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంటు మట్టిని, యమునా నది నీటిని ఏపీ సీఎం చంద్రబాబుకు అందించారు. ఇది అంద‌రికి తెలిసిందే... దీంతో ఈ ఐదు సంవ‌త్స‌రాల్లో అమ‌రావ‌తి నిర్మాణం మ‌హా అద్బుతంగా జ‌రుగుతుంది అని, పాల‌న దిల్లీనా అమ‌రావ‌తా అనే రేంజ్ లో దేశంలో ఓ ఐకాన్ లా అమ‌రావ‌తి అవుతుంది అని అనుకున్నారు అంద‌రూ.
 
అయితే శంకుస్దాప‌న చేసిన శిలాఫ‌ల‌కం కూడా ఇప్పుడు మ‌ట్టిప‌ట్టి, వెక్కిరిస్తోంది అక్క‌డకు వ‌స్తున్న సంద‌ర్శ‌కుల‌ను చూసి.  ఏపీకి ప్ర‌త్యేక హూదా ఇవ్వ‌డంలో బీజేపీ నిర్ణ‌యం పై తెలుగుదేశం మండిప‌డింది, ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చింది.
 
అయితే మోదీకి చంద్ర‌బాబుకి మ‌ధ్య అనేక వివాదాలు ఉన్నాయి అంటారు. చెబితే త‌ర‌గ‌నివి తీర్చ‌నివి ఉన్నాయి అంటారు. బాబుపై మోదీకి మొదటి నుంచీ మంట అంటారు తెలుగుదేశం నేత‌లు. అలాగే గుజ‌రాత్ అల్ల‌ర్ల విష‌యంలో మోదీకి చంద్ర‌బాబు రివ‌ర్స్ అయిన నేత చంద్ర‌బాబు అంటారు.
 
16 ఏళ్ల క్రితం వాజపేయి ప్రధానిగా ఉండగా చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా, ఎన్డీయే భాగస్వామ్య పక్ష నేతగా ఉన్నారు చంద్ర‌బాబు. గుజరాత్‌ అల్లర్ల నేపథ్యంలో 2002 ఏప్రిల్‌లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న మోదీని సీఎం పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు చంద్ర‌బాబు. ఇక తెలుగుదేశం నాయ‌కులు చెప్పే మాట ఒక‌టే,  గుజరాత్‌ అల్లర్ల సమయంలో చంద్రబాబు అనుసరించిన ముక్కుసూటి వైఖరి మోదీ మరిచిపోయి ఉండరని  అందుకే మోదీకి చంద్రబాబు అంటే ప‌డ‌దు అని అంటారు. ఇక ప్ర‌ధాని అయ్యాక ఈ ప‌గ తీర్చుకుంటున్నారు అని విమ‌ర్శ‌లు చేస్తుంటారు.
 
!!గుజ‌రాత్ అల్ల‌ర్ల  స‌మ‌యంలో జ‌రిగిన సంగ‌తి తెలుసుకుంటే !!
2002 లో లోక్‌సభలో 28 మంది సభ్యులతో వాజపేయి ప్రభుత్వానికి చంద్రబాబు తెలుగుదేశం త‌రపున  మద్దతుఇచ్చారు. అదే సమయంలో గుజరాత్‌ అల్లర్లు జరిగాయి గుజ‌రాత్ లో. ఆ స‌మ‌యంలో  శాంతి భద్రతల్ని పునరుద్ధరించడంలో గుజరాత్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చాలా మంది గ‌ళం విప్పారు, ఏకంగా ప్ర‌ధాని ప‌ద‌విని సైతం వద్దు అని ఆనాడు చెప్పిన సీఎం చంద్రబాబు గట్టిగా పట్టుపట్టినందునే మోదీని తప్పించేందుకు వాజపేయి ప్రయత్నించారు అని అంటారు. కాని కొన్ని నిర్ణ‌యాలు పార్టీలో కొంద‌రి ఆచ‌ర‌ణ నిర్ణ‌యాల మేర‌కు ఆద్వాణీ కూడా చెప్ప‌డంతో మోదీ ప‌ద‌వి నిలిచింది. ఆయ‌న సీఎంగా కొన‌సాగారు త‌ర్వాత రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు అదుపులోకి వ‌చ్చాయి.
 
2003లో మోదీ గణేశ్‌ నిమజ్జనోత్సవానికి హైదరాబాద్‌ రావాలని ప్రయత్నించారు. అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు గట్టిగా మోదీని  అడ్డుకున్నారు. అప్పటి నుంచే చంద్రబాబుపై మోదీ లోలోపల రగిలిపోతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక హైద‌రాబాద్ లో అడుగు పెడితే అరెస్ట్ చేస్తాము అని అల్టిమేటం చేశారు చంద్ర‌బాబు. దీంతో మోదీ వెన‌క‌డుగువేశారు.
 
ఇక అలాగే సింగపూర్‌ వ్యవస్థాపకుడు లీ కువాన్‌యెవ్‌ కన్నుమూసినప్పుడు చంద్రబాబు అక్కడికి వెళ్లాలనుకున్నారు. కానీ... విదేశాంగ మంత్రిత్వ శాఖ అనుమతి ఇవ్వలేదు. ప్రధానమంత్రితో వెళ్లే బృందంలోనూ చంద్రబాబుకు చోటివ్వలేదు దీనికి కార‌ణం మోదీ అని అంటారు తెలుగుదేశం నేత‌లు.
 
అయితే దీనిని బీజేపీ నాయ‌కులు కొట్టిపారేస్తున్నారు. అస‌లు మోదీ చంద్ర‌బాబు పై ప‌గ తీర్చుకోవాలి అని ఏమైనా అనుకుంటారా?  ఇన్ని రాష్ట్రాలు ఉన్న దేశంలో ప్ర‌ధానిగా ఉన్న ఆయ‌న ప్ర‌జ‌లంద‌రి మ‌నిషి, అలాగే చంద్ర‌బాబు పై ప‌గ తీర్చుకుంటారు అనే మాట చాలా దారుణం అని, తెలుగుదేశం త‌న త‌ప్పుల‌ను క‌ప్పిపుచ్చుకోవ‌డానికి ఇటువంటి కామెంట్లు చేస్తోంది అంటారు. అయితే ప‌ర్స‌న‌ల్ గా మోదీకి బాబు పై ప‌గ ఉంటే?  ఎందుకు  అమ‌రావ‌తి ప్ర‌ధాని మోదీ వ‌స్తారు. అలాగే చంద్ర‌బాబుతో అన్నిసార్లు భేటీ ఎందుకు అవుతారు?  అని ప్ర‌జ‌లు బీజేపీ నాయ‌కులు కూడా ప్ర‌శ్నిస్తున్నారు.
 
! గ‌ణేష్ .వి !!

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.