జ‌గ‌న్ ను ఎదుర్కొనేందుకు బాబు మ‌రో కొత్త పార్టీతో పొత్తు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-30 18:30:31

జ‌గ‌న్ ను ఎదుర్కొనేందుకు బాబు మ‌రో కొత్త పార్టీతో పొత్తు

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు అనేక సంద‌ర్బాల్లో త‌న అనుకూల మీడియాతో భార‌త దేశంలో త‌నను మించిన రాజ‌కీయ అనుభ‌వ‌గ్నుడు  లేడంటు ప్ర‌చారం చేసుకుంటుంటారు. అంతేకాదు జాతీయ మీడియాలో చ‌ర్చ‌వేధిక జ‌రిగిన‌ప్పుడు వ‌చ్చి రాని ఇంగ్లీష్ లో మాట్లాడుతూ వాట్ ఆయాం సేయింగ్ అయాం 40 ఇయ‌ర్స్ పొలిటిక‌ల్‌ సీనియ‌ర్ ప‌ర్సన్, అయినో ఎవ్రీథింగ్ అంటూ ప్రచారం చేసుకున్న సంద‌ర్భాన్ని ప్ర‌తీ ఒక్క‌రు చూసి ఉంటారు.
 
అంతేకాదు గ‌తంలో ఆయ‌న చ‌రిత్ర‌ను గ‌మ‌నించిన‌ట్లు అయితే త‌న ప్ర‌త్య‌ర్థుల‌ను ఎదుర్కోలేక ఇత‌ర పార్టీ నాయ‌కులతో పొత్తుపెట్టుకుని త‌న ప్ర‌త్య‌ర్థుల‌పై పోటీ చేశారు. అలా ప్ర‌త్య‌ర్థుల‌ను ఇత‌ర పార్టీ నాయ‌కుల‌తో పొత్తుపెట్టుకుని ఎదుర్కోవ‌టం ముఖ‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుని మించిన నాయ‌కుడు లేరు. గ‌తంలో కూడా వైఎస్ ను రాజ‌కీయంగా ఎదుర్కోలేక ఇత‌ర పార్టీ నాయ‌కుల‌తో పొత్తు పెట్టుకుని పోటీ చేశారు. కానీ వైఎస్ నీతి, నిజాయితీ రాజ‌కీయాల ముందు బాబు ఆట‌లు సాగ‌లేదు. 
 
ఇక తెలుగు రాష్ట్రాల విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత 2014లో మొద‌టిసారి ఎన్నిక‌లు జ‌రిగితే ఆ ఎన్నిక‌ల్లో కూడా వైఎస్ కుమారుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ప్ర‌త్య‌క్షంగా ఎదుర్కోలేక బీజేపీ, జ‌న‌సేన పార్టీలతో పొత్తుపెట్టుకుని కేవ‌లం 1.5 స్ప‌ల్ప తేడాతో అధికారంలోకి వ‌చ్చారు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా మ‌రోసారి జ‌గ‌న్ ను ప్ర‌త్యక్షంగా ఎదుర్కోలేక చంద్ర‌బాబు మ‌రో కొత్త పార్టీ బీఎస్పీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ద‌మ‌య్యార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా  వైసీపీకి స‌పోర్ట్ గా ఉన్న ఎస్సీ ఓట్ల‌ను చీల్చేందుకు చంద్ర‌బాబు బీఎస్పీతో  పొత్తుపెట్టుకుని ఎస్సీ ఓట్ల‌ను త‌న వైపు తిప్పుకోవాల‌ని చూస్తున్నారు.
 
గ‌తంలో కూడా చంద్ర‌బాబు బీజేపీ తో జ‌గ‌న్ మైత్రి అంటూ ప్ర‌చారం చేయిస్తూ క్రిస్టియ‌న్ ఓటర్లలో అనుమాన౦ పెంచారు. ఇక ఇప్పుడు బీఎస్పీ ని పోటీలో నిలబెట్టగలిగితే ఎస్సీల ఓట్లు కచ్చితంగా చీల్చొచ్చు అనే ఎత్తుగడతో పని చేస్తున్నారట చంద్ర‌బాబు నాయుడు. సో.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు నాయుడు మ‌రో పార్టీతో పోత్తు పెట్టుకుని అధికారంలోకి రావాల‌ని చూస్తున్నారు. చూద్దాం వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏం జ‌రుగుతుందో. గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా యూట‌ర్న్ రాజ‌కీయాలు చేసిన చంద్ర‌బాబుకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎస్సీలు ఓట్లు వేస్తారా అన్న‌ది పెద్ద‌ ప్ర‌శ్న‌గా మారింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.