ఒక్క‌టైన బ‌ద్ద శ‌త్రువులు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-22 17:19:10

ఒక్క‌టైన బ‌ద్ద శ‌త్రువులు

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుకి, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు కొద్దికాలంగా ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌న్న‌ట్లు గా వ్య‌వ‌హ‌రిస్తున్న‌సంగ‌తి తెలిసిందే.  2014 సార్వత్రిక ఎన్నిక‌ల్లో  మంచి మిత్రులుగా ఉన్న వీరిద్ద‌రు 2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్నత‌రుణంలో బ‌ద్ద శ‌త్ర‌వులుగా మారారు.
 
అందులో భాగంగానే  కొద్దిరోజుల క్రితం ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ త‌ర‌పున భారీ బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేసి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, అలాగే ఆయ‌న కుమారుడు మంత్రి లోకేశ్ ను, టీడీపీ ఎమ్మెల్యేల‌ను తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. ఇక ఆయ‌న చేన‌సి విమ‌ర్శ‌ల‌కు టీడీపీ నాయ‌కులు మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి రీ కౌంట‌ర్ ఇచ్చారు. ఇక ఈ విమ‌ర్శ‌లు సూమారు ఒక నెల పాటు సాగింది. 
 
అయితే చాలా రోజుల త‌ర్వాత ఒక‌రికొక‌రు బ‌ద్ద శ‌త్రువులుగా భావించిన చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇద్ద‌రు ఈ రోజు ఒక్క‌ట‌య్యారు. ఇందుకు గుంటూరు జిల్లా నంబూరు వేదికైంది.దశావతార వేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి వీరిద్ద‌రు హాజరయ్యారు. ఇక ఈ కార్య‌క్ర‌మం ముగిసిన తర్వాత వీర‌ద్ద‌రు మాట్లాడుకుంటారా లేదా అన్న‌ది ప్ర‌శ్న‌గా మార‌నుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.