రైతుపై చంద్ర‌బాబు ఫైర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-12 04:28:50

రైతుపై చంద్ర‌బాబు ఫైర్

అమ‌రావ‌తి అంటేనే తెలుగుదేశం నాయ‌కులు మాదే అనే రేంజ్ కు తీసుకువెళ్లారు అని అంటున్నారు వైసీపీ నాయ‌కులు.. మూడు సంవ‌త్స‌రాల క్రితం ఇక్క‌డ రాజ‌ధాని కోసం తీసుకున్న భూములు నిర్మాణాలు లేక  పంట‌లు లేక బీడుగా మారాయని, అలా రైతుల నుంచి పొలాలు తీసుకున్న తెలుగుదేశం నాయ‌కులు... ఇక్క‌డ ఎటువంటి నిర్మాణాలు చేప‌ట్ట‌లేద‌ని అక్క‌డ ప్ర‌జ‌లు  విమ‌ర్శిస్తున్నారు.
 
తుళ్లూరు మండలం వెంకటపాలెంలో నిర్వహించిన సభలో నేడు ముఖ్య‌మంత్రి  చంద్రబాబు పాల్గొన్నారు.. ఈ స‌మ‌యంలో ఓ రైతు ఆవేద‌న‌గా త‌న బాధ‌ను తెలిపాడు..సుబ్బయ్య అనే రైతు తనపై దాడిచేశాడని, ఈవిషయంపై  పోలీసులుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, రామాంజనేయులు అనే రైతు చంద్రబాబుకు వివరించాడు. దీనిపై చంద్ర‌బాబు విచార‌ణ‌కు ఆదేశించారు... ఇంకా ఆవేద‌న‌తో ఉన్న రైతు రామాంజ‌నేయులు అమ‌రావ‌తి ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ లేద‌న్నాడు.
 
ఈ మాట‌లు సీఎం చంద్రబాబుకు ఆగ్ర‌హం తెప్పించాయి... పెద్ద పెద్ద మాటలు మాట్లాడొద్దంటూ ముఖ్యమంత్రి రామాంజనేయులుకు వార్నింగ్‌ ఇచ్చారు.. అయితే సీఎం రైతు మాటలు విని వెంట ఉంటాం సాయం చేస్తాం అనాల్సింది పోయి... దేశానికి అన్నం పెట్టే రైత‌న్న‌పై ఆగ్ర‌హాం వ్య‌క్తం చేయ‌డం ఏమిట‌ని రైతులు చ‌ర్చించుకున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.