అన్న క్యాంటిన్లో అన్నం నిల్ ఇదిగో సాక్షం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-14 18:04:58

అన్న క్యాంటిన్లో అన్నం నిల్ ఇదిగో సాక్షం

అన్నీ తానై చెప్పుకునే ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు తాజాగా విజ‌య‌వాడ‌లో జ‌రిగిన అంగ‌న్ వాడి స‌ద‌స్సులో పాల్గొన్నారు. పేరుకు మాత్రం అవ‌గాహ‌న స‌ద‌స్సు కావ‌చ్చు కానీ ప్ర‌భుత్వ సొమ్ముతో ఏర్పాటు చేసిన ఈ స‌ద‌స్సును టీడీపీ ప్ర‌చార స‌భ‌గా అంగ‌న్ వాడీ కార్య‌క్ర‌మంగా మార్చేశార‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అయితే త‌న సొంత ప్ర‌చారంలోనే అడ్డంగా దొరికిపోయారు బాబు. 
 
తాము అధిక‌రంలోకి వ‌చ్చిన త‌ర్వాత అంగ‌న్ వాడీల‌కు సెల్ ఫోన్లును ఇచ్చామ‌ని 16 ర‌కాల రికాడ్స్ ల‌ను మోసే ప‌ని త‌ప్పింద‌ని స‌భా ముఖంగా బాబుగారు ఘ‌నంగా ప్ర‌క‌టించుకున్నారు. అయితే అక్క‌డే ఉన్న వేలామంది అంగ‌న్ వాడీ మ‌హిళ‌లు త‌మ‌కు సెల్ ఫోన్లు అంద‌లేదంటూ భ‌హిరంగంగానే చేతులు ఎత్త‌డంతో బాబు కంగుతిన్నారు. ఇక వెంట‌నే త‌న‌దైన శైలిలో ఈ నెపాన్ని అధికారుల మీద‌కు నెట్టేశారు చంద్ర‌బాబు నాయుడు. తాను ప‌దేప‌దే అంగ‌న్ వాడీల‌కు సెల్ ఫోన్లు ఇవ్వ‌మ‌ని చెప్పినా అధికారులు త‌న‌కు తెలియ‌కుండా జిమ్మిక్కు చేశార‌ని అయితే ఆగ‌స్ట్ 15 నాటికి అంద‌రికి సెల్ ఫోన్లు ఇస్తామ‌ని ప్ర‌క‌టించి ఆ విష‌యంలో త‌ప్పించుకున్నారు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు.
 
ఇక సేమ్ అలాంటిదే విజ‌య‌వాడ‌లో జ‌రిగిన మ‌రో ఘ‌ట‌న‌లో కూడా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అడ్డంగా బుక్కైపోయారు. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ‌ అన్నా క్యాంటిన్ల‌ను ఏర్పాటు చేసిన చంద్ర‌బాబు... అది కేవ‌లం ప్ర‌చారం కోసమే అన్న విష‌యాన్ని మ‌రోసారి త‌న‌కు తానే నిరూపించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటిన్ల సంగ‌తి ప‌క్క‌న పెడితే రాజ‌ధాని అమ‌రావ‌తి స‌మీపంలో ఏర్పాటు చేసిన క్యాంటిన్ రెండో రోజుకే మూసివేయ‌బ‌డింది.
 
ఇక దీనికి సంబంధించి క్యాంటిన్ అధికారుల‌ను వివ‌ర‌ణ అడిగితే ప్ర‌తీరోజు కేవ‌లం మూడు వంద‌ల‌మందికే భోజ‌నం పెట్ట‌మ‌న్నార‌ని, మిగతా వారికి అన్నం పెట్లొద్ద‌న్నారంటూ అధికారుల నుంచి స‌మాధానం వ‌చ్చింది. దీంతో భోజ‌నం కోసం వ‌చ్చిన పేద‌లు వ‌ట్టి ఆకుల‌తో వెనుతిర‌గాల్సి వ‌చ్చింది. కేవ‌లం విజ‌య‌వాడ‌లోనే కాదు చాలా క్యాంటిన్ల‌లో ఇదే ప‌రిస్థితి. 
 
భ‌వంతుల‌కు గేట్లుకు క‌ట్లిన దండ‌లు, బ‌య‌ట క‌ట్టిన బాబు క‌టౌట్లు కూడా ఇంకా వాడిపోక‌ముందే ఇంత‌లోనే అన్నం లేదన‌డంలో ఇది ప్ర‌చారం కాక మ‌రేమిట‌ని ప్ర‌జ‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. రెండో రోజుకే ప‌ట్టెడ‌న్నం పెట్ట‌లేని ప‌రిస్థితి ఉన్న‌ప్పుడు అన్నా క్యాంటిన్ల‌ను తెర‌వ‌డం ఎందుకు పైగా ఈ నాలుగేళ్ల‌లో లేని ఈ కాన్సెప్ట్ ఇప్పుడు ఎందుకు తెర‌పైకి తీసుకు వ‌చ్చార‌ని విమ‌ర్శ‌లు చేస్తున్నారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.