బాబు అస‌లు రంగు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ap cm nara chandrababu naidu
Updated:  2018-05-04 06:56:12

బాబు అస‌లు రంగు

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ప్ర‌త్యేక హోదా విష‌యంపై త‌న అస‌లు రూపం బ‌య‌ట పెట్టారు... ఈ రోజు గుంటూరులో ఏర్పాటు చేసిన టీడీపీ ప్ర‌జా ప్ర‌తినిధుల‌ శిక్ష‌ణా త‌ర‌గ‌తుల కార్య‌క్ర‌మంలో చంద్రబాబు మాట్లాడారు..
 
ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... రాష్ట్రానికి ప్రత్యేక హోదా కేటాయించ‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌ని తెలిపారు... హోదా ప్ర‌క‌టించి నిధులు ఇవ్వ‌కపోతే ఏం లాభమ‌ని,హోదా ఉన్న రాష్ట్రాలు ఏవిధంగా బాగుప‌డ్డాయ‌ని చంద్ర‌బాబు తెలిపారు...ప్ర‌త్యేక హోదా వ‌ల్ల ప‌రిశ్ర‌మ‌లు రావని అభివృద్ది కూడా జ‌రుగ‌ద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.
 
కేవ‌లం ప్ర‌త్యేక ప్యాకేజీ వల్లే రాష్ట్రం బాగు ప‌డుతుంద‌ని, అదే విష‌యాన్ని రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యే విధంగా వివ‌రించాల‌ని చంద్ర‌బాబు పార్టీ నాయ‌కుల‌కు సూచించారు... దీంతో పాటు ప్ర‌తిప‌క్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు చేస్తున్న ప్ర‌త్యేక హోదా పోరాటం తిప్పి కొట్టేలా ప్యాకేజీపైన ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని  పార్టీ నేతలకు, కార్యకర్తలకు చంద్ర‌బాబు సూచించారు.
 
ఇక ఇదే విష‌యంపై ప్ర‌తిప‌క్షాల‌తో పాటు రాష్ట్ర ప్ర‌జ‌లు కూడా త‌మ దైన శైలిలో విమ‌ర్శ‌లు చేస్తున్నాయి...2014 లో వెంక‌న్న సాక్షిగా బీజేపీ అధికారంలోకి వ‌స్తే  ప‌ది సంవ‌త్స‌రాలు  ప్ర‌త్యేక హోదా ప్ర‌క‌టిస్తామ‌ని చెబితే మాకు ప‌ది సంవ‌త్స‌రాలు కాదు  15 సంవ‌త్స‌రాలు ప్ర‌త్యేక హోదా కేటాయించాల‌ని చంద్ర‌బాబు ఎన్నిక‌ల ప్ర‌చారంలో  కోరారని అన్నారు.
 
అయితే ఈ ఎన్నిక‌ల త‌ర్వాత చంద్ర‌బాబు కేంద్రానికి అమ్ముడు పోయి రెండు నాలుకల ధోరణి లాగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ప్ర‌తిప‌క్ష వైసీపీ మండిపడుతోంది.. త‌ప్పుడు హామీలు త‌ప్పుడు వాగ్దాలను ప్ర‌జ‌లు ప్ర‌క‌టించి అధికారంలో వ‌చ్చిన చంద్రబాబు ఇప్పుడు కొంగ జ‌పం చేస్తున్నార‌ని ఆరోపిస్తున్నాయి... ప్ర‌త్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు త‌మ ప‌ద‌వులును, ప్రాణాల‌ను సైతం లెక్క‌చేయ‌కుండా ఏపీ భ‌వ‌న్ లో నిరాహార దీక్ష చేశార‌ని గుర్తు చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.