చంద్ర‌బాబు గెట‌ప్ అదిరిందిలే...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu biopic
Updated:  2018-09-25 10:43:20

చంద్ర‌బాబు గెట‌ప్ అదిరిందిలే...

తెలుగు చిత్ర‌పరిశ్ర‌మ‌లో బ‌యోపిక్ ల ప‌ర్వం కొన‌సాగుతూనే ఉంది. చిత్ర ద‌ర్శకులు గ‌తంలో రాజ‌కీయంగా సిని ప‌రంగా ఓ వెలుగు వెలిగిన వ్య‌క్తుల‌ చ‌రిత్ర‌ను ఆధారంగా చేసుకుని తెర‌కెక్కిస్తున్నారు. అయితే ఇప్ప‌టికే రాజ‌కీయ ప‌రంగా మాజీ ముఖ్య‌మంత్రులు, ఎన్టీఆర్, వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి చిత్రాల‌ను తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక సిని ప‌రంగా గంట‌సాల అక్కినేని జీవిత క‌థ‌ను ఆధారంగా చేసుకుని ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు ఓ సినిమాని తెర‌కెక్కిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.
 
అయితే ఇదే క్ర‌మంలో ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు జీవిత క‌థ ఆధారంగా చేసుకుని ఓ సినిమా తెర‌కెక్కుతుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ను  విడుద‌ల చేసింది చిత్ర యూనిట్. ఈ చిత్రంలో చంద్ర‌బాబు నాయుడు పాత్ర‌లో వినోద్ నువ్వుల న‌టిస్తున్నారు. వినోద్ న‌టిస్తున్న ఈ చిత్రానికి చంద్రోద‌యం అనే టైటిల్ ఖ‌రారు చేశారు. ఇక ఈ చిత్రానికి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల అయిన సంద‌ర్భంగా వినోద్ త‌న సోష‌ల్ మీడియా ద్వారా ఆనందాన్ని పంచుకున్నారు.
babu bio pic
 
చంద్రోదయం” ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. చంద్రబాబు గారి పాత్రలో నేను నటించడం నా పూర్వజన్మ సుకృతం. మీ అందరి ఆశీర్వాదాలతో,సహాయ సహకారాలతోనే ఇది నాకు సాధ్యమయింది అనుకుంటున్నాను. ఈ అవకాశం నాకిచ్చిన డైరెక్టర్ వెంకటరమణ గారికి చిరంజీవి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.