తెర‌పై బాబు బ‌యోపిక్ మామ, అల్లుడు పాత్ర‌లో వీరే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

nandamuri taraka rama rao and chandrababu
Updated:  2018-09-01 11:42:00

తెర‌పై బాబు బ‌యోపిక్ మామ, అల్లుడు పాత్ర‌లో వీరే

ఇటీవ‌లే తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో బ‌యోపిక్ ల ప‌ర్వం కొన‌సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే మ‌జీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌మూరి తార‌క‌రామారావు జీవిత‌క‌థ ఆధారంగా చేసుకుని ద‌ర్శకుడు క్రిష్ తెర‌కెక్కిస్తున్నారు. ఇక ఇదే క్ర‌మంలో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి బ‌యోపిక్ కూడా మ‌రో ద‌ర్శ‌కుడు రాఘ‌వ్  తెకెక్కిస్తున్నాడు. 
 
ఇక వీరితో పాటు ప్ర‌స్తుత ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు చ‌రిత్ర ఆధారంగా ఒక చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రానికి వెంక‌ట‌ర‌మ‌ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుంటే జి. జే రాజేంద్ర నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ చిత్రంలో చంద్ర‌బాబు నాయుడు పాత్ర‌లో వినోద్ నువ్వుల‌, ఆయ‌న మామ ఎన్టీఆర్ పాత్ర‌లో భాస్క‌ర్ న‌టిస్తున్నారు.
 
ఓ నిరుపేద కుటుంబంలో నుంచి చంద్ర‌బాబు నాయుడు ఎలా విద్యాబ్యాసం కొన‌సాగించారు. ఆయ‌న చ‌దువుకున్న రోజుల్లో విద్యార్థి సంఘాల నాయ‌కుడిగా ఎలా ఎదిగారు. అ త‌ర్వాత ఎమ్మెల్యేగా మంత్రి, ఆ త‌ర్వాత ముఖ్య‌మంత్రి అధిష్టానాన్ని ఎలా చేరుకోగ‌లిగాడు అనే విష‌యాల‌న్ని ఈ సినిమాలో చూపించ‌నున్నారు.
 
తాజాగా ఈ సినిమా ద‌ర్శ‌కుడు వెంక‌ట‌ర‌మ‌ణ‌ మాట్లాడుతూ... సినిమాకు సంబంధించి 80 శాతం షూటింగ్ పూర్తి అయింద‌ని తెలిపాడు.  ఈ సినిమాకు రాజ్ కిరణ్ పి.ఆర్ సంగీతం అందిస్తున్నార‌ని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప