చంద్ర‌బాబు నైజం ఇదే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu fake politics
Updated:  2018-03-25 12:12:13

చంద్ర‌బాబు నైజం ఇదే

టీడీపీ-బీజేపీ మిత్ర బంధంతో గ‌త ఎన్నిక‌ల్లో పోటి చేసి విజ‌యం సాధించిన త‌ర్వాత నాలుగు సంవ‌త్స‌రాలు క‌లిసి ప‌రిపాల‌న చేసిన విష‌యం ప్ర‌జ‌లంద‌రికి తెలిసిందే.... ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాల దృష్ట్యా ఈ రెండు పార్టీల‌ మైత్రిబంధం చెడిన సంగ‌తి తెలిసిందే. ఎన్డీయే నుంచి వైదొల‌గ‌డానికి విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాలు, ప్ర‌త్యేక‌హోదా ప్ర‌క‌టించ‌క పోవ‌డ‌మే ప్ర‌ధాన‌ కార‌ణం అంటూ కేంద్ర ప్ర‌భుత్వానికి సీఎం చంద్ర‌బాబు లేఖ రాశారు. దీనికి స్పందించిన బీజేపీ సారథి అమిత్ షా చంద్ర‌బాబును కౌంట‌ర్ చేస్తూరాసిన లేఖ‌ను ఆయ‌న విడుద‌ల చేశారు.
 
అమిత్ షా కౌంట‌ర్ చేస్తూ 9పేజీలు రాసిన లేఖ‌కు స్పందించిన చంద్ర‌బాబు అసెంబ్లీలో మాట్లాడుతూ వాటిలో ఉన్న మొత్తం విషయాలన్నీ అసత్యాలు, వక్రీకరణలే అని ఆయ‌న స‌భ‌కు తెలిపారు. గౌర‌వ‌ప్ర‌ద‌మైన ప‌ద‌విలో ఉన్న అమిత్‌ షా రాష్ట్రాన్ని రెచ్చగొట్టేలా లేఖ రాయ‌డం దారుణం అని సీఎం చంద్ర‌బాబు అన్నారు... దీనికి స్పందించిన బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహరావు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ చంద్ర‌బాబు పై నిప్పులు చెరిగారు.
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు గడిచిన నాలుగేళ్లలో రూ.1,26,000 కోట్ల నిధులు ఇచ్చామని ఆయన తెలిపారు. ఇక ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయమని స్వ‌యాన చంద్ర‌బాబే  వెల్ల‌డించిన‌ట్లు గుర్తు చేశారు. దానివల్ల రాష్ట్రానికి ఉపయోగం లేదని,  ప్రత్యేక హోదా‌‌ సంజీవని కాదని అన్నారని, జీవీఎల్‌ నరసింహరావు గుర్తుచేశారు. టీడీపీ నేతలు  తమపై దుష్ప్రచారం చేస్తున్నారని జీవీఎల్‌ మండిపడ్డారు.
 
టీడీపీ యూటర్న్‌ల మీద యూటర్న్‌లు తీసుకుంటోందని విమర్శించారు. ఎన్డీయే నుంచి చంద్రబాబు ఏకపక్షంగా వెళ్లిపోవ‌డానికి కేవ‌లం రాజ‌కీయ ల‌బ్దికోస‌మే అని అన్నారు. ఏపీ ప్రయోజనాలు కాపాడే పార్టీ బీజేపీ మాత్రమేనని తెలిపారు. అభివృద్ధి రాజకీయాల కోస‌మే తాము పని చేస్తున్నామని, ఏ రాష్ట్రంపైనా వివక్ష చూపడం లేదని చెప్పారు. గత మూడేళ్ళలో తొమ్మిది కేంద్ర సంస్థలు రాష్ట్రానికి వచ్చాయని, విశాఖలో రైల్వే జోన్, కడపలో స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం పోర్టు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.