ట్వీట్ తీసేసిన సీఎం చంద్ర‌బాబు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ap cm nara chandrababu naidu tweet image
Updated:  2018-02-28 05:37:58

ట్వీట్ తీసేసిన సీఎం చంద్ర‌బాబు

బ్యాంకు అకౌంట్ పాస్ వ‌ర్డ్ లు ఎలాంటివో సోష‌ల్ మీడియా అకౌంట్లు అలాంటివి.. అన్నివివ‌రాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అప్ డేట్ గా ఇవ్వ‌డానికి ఈ సోష‌ల్ మీడియా మాధ్య‌మం ఓ వేదిక‌గా వాడుతున్నారు ప్ర‌ముఖుల నుంచి సామాన్యుల వ‌ర‌కూ ... అయితే ఇప్ప‌టికే ప‌లు పార్టీల ద్వారా సోష‌ల్ మీడియాలో ఏవిధమైన ప్రచారాలు జ‌రుగుతున్నాయో తెలిసిందే.
 
తాజాగా తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు చేసిన ట్వీట్ ఇప్పుడు విమ‌ర్శ‌ల‌కు దారితీసింది... వీర సావ‌ర్క‌ర్ వ‌ర్ధంతి సంద‌ర్బంగా ట్విట్ట‌ర్ ద్వారా నివాళులు అర్పించారు..  హంబుల్ ట్రిబ్యూట్స్ టు వీర సావర్క‌ర్ జీ ఆన్ హిజ్ డెత్ యానివ‌ర్సిరీ” అంటూ ట్వీట్ చేశారు.. అయితే చేసిన ట్వీట్ ను ఉంచ‌కుండా వెంట‌నే ఆ ట్వీట్ ను డిలీట్ చేశారు.
ap cm nara chandrababu naidu
దీంతో కొంద‌రు ఈ ట్వీట్ ను చూసి స్క్రీన్ షాట్ తీసుకున్నారు.. అలాగే భ‌ద్ర‌ప‌రిచారు.. కాసేప‌టికి ఈ ట్వీట్ అధికారిక అకౌంట్లో తొల‌గించ‌డం పై బాబు చేసిన ప‌నిని త‌ప్పుబ‌ట్టారు..సావర్క‌ర్‌పై పెట్టిన ట్వీట్‌ను ఎందుకు తొల‌గించార‌ని మండిపడుతున్నారు. ట్వీట్ తొల‌గించ‌డం పై కార‌ణం చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నారు.
 
ఈ ట్వీట్ పై విలేక‌రులు సీఎం చంద్ర‌బాబుని ప్ర‌శ్నించారు... ఇది పెద్ద విష‌యం కాద‌ని అన్నారు. ట్విట‌ర్ వ్య‌వ‌హారాలు అన్ని ఓ టెక్నిక‌ల్ టీమ్ చూస్తోంద‌ని అన్నారు.. అయితే గ‌తంలో కూడా ఇలాంటివి ప‌లు సంద‌ర్బాల‌లో జ‌రిగినా పెద్ద పట్టించుకున్న దాఖ‌లాలు లేవు అంటున్నారు.. అయితే సోష‌ల్ మీడియా ప్రాచుర్యంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఎటువంటి దాప‌రికాలు లేకుండా అన్ని బ‌హిర్గ‌తం అవుతున్నాయి... అని జ‌నాలు చ‌ర్చించుకుంటున్నారు.. టెక్నాల‌జీని అందిపుచ్చుకోవ‌డంలో బాబు త‌ర్వాతే ఎవరైనా అంటున్నారు తెలుగుదేశం నేత‌లు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.