2014 సాధారణ ఎన్నికల కన్నా ముందే జరిగిన స్థానిక ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించిందన్నారు చంద్రబాబు. బీజేపీతో పొత్తు లేకుండా ఎన్నికల బరిలో తమకు విజయం ఎక్కువ వచ్చింది అని, ఇక పొత్తు ఉన్నప్పుడు పొత్తు లేనప్పుడు చూసుకున్న ఓట్లలో పెద్ద వ్యత్యాసం ఏమీ లేదని ఆయన అన్నారు... బీజేపీ వల్ల అదనంగా ఏపీకి ఎటువంటి ఓటు బ్యాంకు కలగలేదని అన్నారు చంద్రబాబు.
రాష్ట్రం విడిపోయిన సమయంలో రాష్ట్ర సంక్షేమం కోసం రాష్ట్రానికి మేలు జరుగుతుంది అని బీజేపీతో జతకట్టాము అని అన్నారు చంద్రబాబు.. అంతేకాని రాజకీయ కారణాలు లేవు అని అన్నారు.. ముందు ప్రత్యేక హూదా ఇస్తాము అన్నారు. ఇక ఆ పని చేయలేదు, పోని ప్రత్యేక ప్యాకేజీ అన్నారు దానికి కూడా నిధులు కేటాయించడం లేదు అని అందుకే బయటకు వచ్చాము అని అన్నారు చంద్రబాబు.. ఈఏపీ ద్వారా నిధులు ఇస్తామని ఏడాదిన్నర క్రితం హామీ ఇచ్చిన కేంద్రం ఇంతవరకు దానిని నిలబెట్టుకోలేదన్నారు. అడిగిన ప్రతిసారి పంపిస్తున్నాం.. యూసీలు కావాలని కేంద్రం అడిగిన ప్రతిసారీ, ఎప్పటికప్పుడు స్పందించి పంపుతూనే ఉన్నామని చంద్రబాబు తెలిపారు.
కేంద్రం నుంచి తమ ఎంపీలను ఇద్దరిని వెనక్కి తీసుకోవడం రాజీనామాలు చేయించడం పై 98 శాతం మంది మమ్మల్ని అభినందిస్తున్నారు అని అంటున్నారు చంద్రబాబు... అయితే బీజేపీ నుంచి బయటకు రావడం మంచిది అయిందని బాబు చెప్పారు అని, తెలుగుదేశం నాయకులు చర్చించుకుంటున్నారు.
Comments