చంద్ర‌బాబు దీక్ష పేరు ఇదే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-18 13:21:58

చంద్ర‌బాబు దీక్ష పేరు ఇదే

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ ధినేత చంద్ర‌బాబు నాయుడు త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ నెల 20 న ఒక రోజు నిరాహార దీక్ష చేస్తాన‌ని చెప్పిన సంగ‌తి తెలిసిందే... ఈ నిరాహార దీక్షను కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా చేస్తున్నాన‌ని తెలిపారు చంద్ర‌బాబు... అమ‌రావ‌తిలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయ‌న మాట్లాడుతూ.. విభ‌జ‌న చట్టంలో పేర్కొన్న అంశాల‌ను కేంద్రం వెంట‌నే ప్ర‌టించాల‌ని, అందుకోసమే తాను ఒక‌రోజు నిరాహార దీక్ష చేస్తున్నాణ‌ని తెలిపారు.
 
తాజాగా విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరగనున్న ఈ దీక్షకు ధర్మపోరాట దీక్ష అనే పేరుపెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఈ దీక్ష‌లో నమ్మక ద్రోహం, కుట్రల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం అనే నినాదాన్ని ఈ వేదిక ద్వారా చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌నున్నార‌ని తెలుస్తోంది.
 
అయితే ఈ నిరాహార దీక్ష 20 వ తేదిన  ఉదయం 9 గంటల నుంచి చంద్ర‌బాబు చేయ‌నున్నార‌ని కొద్దిరోజుల క్రితం తెలిపారు.. కానీ ప్ర‌స్తుత స‌మాచారం మేర‌కు ముఖ్య‌మంత్రి జ‌న్మ‌దినం రోజున ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకు చేయాలని నిర్ణయించుకున్న‌ట్లు తెలుస్తోంది. ఆ రోజు పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారట‌.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.