టీడీపీ ఎంపీల‌కు బాబు సూచ‌న‌?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-29 12:47:32

టీడీపీ ఎంపీల‌కు బాబు సూచ‌న‌?

తెలుగుదేశం ఎంపీలు హ‌స్తిన వెళ్లి చేస్తున్న ప‌నులు ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతున్నాయి... ఓ ప‌క్క తెలుగుదేశం అవిశ్వాసం పెడ‌తామంటూ హ‌స్తిన‌లో బీజేపీ పెద్ద‌ల‌ను క‌ల‌వ‌డం, ఆపై ఏపీకి తుల‌మో ఫ‌ల‌మో సాయం కోర‌డం అనే రీతిన మాట్లాడుతున్నారు.. అయితే పార్టీ నాయ‌కులు దీనిపై ఎటువంటి డెసిష‌న్ తీసుకున్నా కేంద్రంలో పెద్ద‌ల‌ను క‌లిసినా అది ఏపీకి ఉప‌యోగ‌ప‌డేరీతిన ఉండే మాట వాస్త‌వ‌మే... అయితే ఓ ప‌క్క కేంద్రం పై అవిశ్వాసం పెడ‌తామంటూ చెప్ప‌డం వెంట‌నే అరుణ్ జైట్లీ లాంటి మంత్రుల‌ను క‌ల‌వ‌డం ఇక్క‌డ ఏపీలో తెలుగుదేశం చేస్తున్న రాజ‌కీయ చ‌ద‌రంగాల‌పై కాస్త అర్ధం అయ్యేలా చేస్తున్నాయి.
 
మ‌రీ ముఖ్యంగా అవిశ్వాస తీర్మానం పెట్టిన వారు ఎవ‌రైనా కేంద్రంతో అంటి ముట్టినట్టు ఉండాలా అని స‌మాధానాలు చెబుతున్నారు... అయితే త‌న‌కు తెలియ‌కుండా కేంద్రంలో పెద్ద‌ల‌ను ఎవ‌రిని క‌ల‌వ‌ద్దు అని సీఎం చంద్ర‌బాబు ఇప్ప‌టికే ఆదేశాలు జారీ చేశారు.. అయితే ఓ ఎంపీ దీనిపై సీఎం చంద్ర‌బాబుకు తెలియ‌కుండా పార్టీ నేత‌ల‌కు తెలియ‌కుండా కేంద్ర మంత్రిని క‌లిశారు అనే వార్త ఇప్పటికే హ‌ల్ చల్ చేసింది.. అయితే తాను వెళ్ల‌లేదు అని ఓ క్లారిటీ ఇచ్చారు స‌ద‌రు ఎంపీ.
 
అయితే వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి అంశం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అవుతోంది.. తెలుగుదేశం అధినేత ఎంపీల‌కు ఓ సూచ‌న చేశారు... పార్ల‌మెంట్ స‌మావేశాలు జ‌రుగుతున్న స‌మ‌యంలో  మీడియా ఫోక‌స్ ఎక్కువ‌గా ఉంది అందుకే కేంద్రంలో పెద్ద‌ల‌ను ఎవ‌రికి క‌ల‌వ‌ద్ద‌ని తెలియ‌చేశారు... త‌మ‌కు తెలియ‌కుండా బీజేపీ పెద్ద‌లు ఎవ‌రిని క‌ల‌వ‌కూడ‌దు అని చంద్ర‌బాబు సూచించారు ఎంపీల‌కు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.