బాబు అద్భుత‌మైన‌ హామీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-11 12:58:42

బాబు అద్భుత‌మైన‌ హామీ

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అధికార‌మే ల‌క్ష్యంగా చేసుకుని ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్‌ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా పాద‌యాత్ర‌ను త‌ల‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఇక దీంతోపాటు వైసీపీ అధికారంలోకి వ‌స్తే వైయ‌స్సార్ రైతు భ‌రోసా, వైయ‌స్సార్ ఆస‌రాతో-డ్వాక్రా మ‌హిళ‌ల‌ పున‌రుద్దార‌ణ‌, పించ‌న్లు రెండువేల‌కు పెంపు, అమ్మఒడి పాఠ‌శాల‌కు వెళ్లే ఒక్కో విద్యార్థికి 500 నుంచి 1000 వ‌ర‌కు ప్రోత్సాహ‌కం, ప్ర‌తీ పేద‌వాడికి 25 ల‌క్షల ఇల్లు, ఆరోగ్య శ్రీ ధీర్ఘ‌కాలిక వ్యాధుల‌కు పింఛ‌న్లు, ఫీజు రీయింబ‌ర్స్ మెంట్- ఉచిత విద్య‌- 2000 వేలు మెస్ చార్జిలు, యుద్ద‌ప్రాతిపాదిక‌న తాగునీటి ప్రాజెక్ట్ ల నిర్మాణం, మూడుద‌శ‌ల్లో మ‌ధ్యం నిశేధం. వంటి ప్ర‌తిష్టాత్మ‌క న‌వ‌ర‌త్నాల జ‌ల్లుల‌ను ప్ర‌క‌టించి జ‌గ‌న్ అత్య‌ధిక సంఖ్యలో ప్ర‌జాధ‌ర‌ణ పొందుతున్నారు. 
 
ఇక మ‌రో వైపు జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా కొద్దిరోజుల క్రితం అధికార టీడీపీ మిత్ర‌ప‌క్షానికి క‌టీఫ్ చెప్పి వ‌చ్చే ఎన్నిక‌ల్లో అన్ని స్థానాల్లో జ‌న‌సేన పోటీ చేస్తుందని ప‌వ‌న్ బ‌హిరంగంగానే ప్ర‌క‌టించి రాష్ట్ర వ్యాప్తంగా బ‌స్సు యాత్ర‌ను మొద‌లుపెట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ బ‌స్సు యాత్ర‌లో భాగంగా ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో ప‌వ‌న్ కూడా ప‌లు హామీల‌ను ప్ర‌క‌టిస్తూ ముందుకు సాగుతున్నారు.
 
ఇక వీరి హామీల‌ను అధిగ‌మించే విధంగా అధికార తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వ‌చ్చే ఎన్నిక‌ల‌కు హామీల‌ను ప్ర‌క‌టించకుండా కేవ‌లం కేంద్రాన్ని మాత్ర‌మే విమ‌ర్శిస్తున్నారు. ఏపీని నాలుగేళ్లుగా మోసం చేసిందంటూ, కుట్ర‌లు ప‌న్నిందంటూ విమ‌ర్శ‌లు చేస్తునే ఉన్నారు చంద్ర‌బాబు నాయుడు. అయితే ఎక్క‌డా 2019 ఎన్నిక‌లకు ఒక్క హామీ కూడా ప్ర‌క‌టించ‌లేదు.
 
దీంతో టీడీపీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కులు ఒక‌రు సార్ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్నాయి ఇంత వ‌ర‌కూ ప్ర‌జ‌ల‌కు మీరు ఒక్క హామీని కూడా ప్ర‌కటించ‌లేద‌ని వివ‌రించార‌ట‌. ఇక ఆయ‌న ఆడిగిన ప్ర‌శ్న‌కు చంద్ర‌బాబు నాయుడు షాక్ తిన్నార‌ట‌. మనం ఎట్టి ప‌రిస్థితిలో హామీల‌ను ప్ర‌క‌టించ‌కూడద‌ని ఒక వేళ‌ ప్ర‌క‌టించినా ప్ర‌జ‌లు న‌మ్మ‌ర‌ని చంద్ర‌బాబు చెప్పార‌ట‌. అలాగే ఎవ‌రు స‌భ‌ల్లో హామీలు ఇవ్వ‌కూడ‌ద‌ని సూచించార‌ట‌. ఎందుకంటే 2014 ఎన్నిక‌ల్లో సూమారు ఆరు వంద‌ల‌కు పైగా హామీల‌ను ప్ర‌క‌టించామ‌ని ఆ హామీలను ప్ర‌జ‌లు ఇప్ప‌టికి మ‌ర్చిపోలేద‌ని, ఈ స‌మయంలో మ‌నం హామీల‌ను ప్ర‌క‌టిస్తే ఎవ్వ‌రు న‌మ్మ‌ర‌ని అన్నార‌ట‌.
 
దీంతో పాటు గతంలో బీజేపీతో  మిత్ర‌ప‌క్షం వ్య‌వ‌హరించి ప్ర‌త్యేక హోదా సాధించ‌లేక పోయింద‌ని ప్ర‌జ‌లు విమ‌ర్శిస్తున్నార‌ని అధిష్టానం భావిస్తోంది. దీనికి తోడు ప్ర‌త్యేక హోదాకు బ‌దులుగా ప్ర‌త్యేక ప్యాకేజీకి జై కొట్టిన సంగ‌తి ప్ర‌జ‌లు ఇంకా మ‌ర్చిపోలేద‌ని అంటున్నారు. ఇక ఇలాంటి క్లిష్ట‌మైన ప‌రిస్థితిలో ఎవ్వ‌రు హామీల‌ను ప్ర‌క‌టించ‌కూడ‌ద‌ని బాబు సూచించార‌ట‌.
 
అయితే ఈ హామీల‌కు వ్య‌తిరేకంగా రాష్ట్రానికి ఏదో ప్రమాదం ఉందని నమ్మించి ఈ  ప్రమాదం నుంచి కాపాడే అనుభవం బాబు ఒక్కడికే ఉందని, రాష్ట్రంలో జగన్‌తో సహా ఇంకెవరికీ అధికారం అప్పగించినా రాష్ట్ర ప్రజలందరూ దిక్కూదివాణం లేకుండా పోతారని ప్రచారం చేయడానికి రెడీ అవుతున్నారు బాబు అండ్ కో. 
 
అయితే గంతంలో కూడా ఇదే స్ట్రాట‌జీని చంద్ర‌బాబు ఉప‌యోగించి అధికారంలోకి వ‌చ్చారు. అయితే ఇదే క్ర‌మంలో మ‌రోసారి ఈ కొత్త స్ట్రాట‌జీని ఉప‌యోగించి మ‌రోసారి అధికారంలోకి రావాల‌ని చంద్ర‌బాబు చూస్తున్నార‌ట‌. చూద్దాం ప్ర‌జ‌లు ప్ర‌జా నిర్ణయం ఎటు వైపు ఉంటుందో.

షేర్ :

Comments

1 Comment

  1. Malli Babu maata nammi mosapotaniki ap prajalu siddamgaa leru,Babu chesina mosalaku,dopidiki 2019 lo odinchi buddi cheptavu

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.