ఆ జిల్లాలో బాబుకు వ‌ణుకు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-06 12:33:05

ఆ జిల్లాలో బాబుకు వ‌ణుకు

తెలుగు దేశం పార్టీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సుమారు ప‌ద‌మూడు సంవ‌త్స‌రాల‌పాటు ముఖ్య‌మంత్రి బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ ఘ‌న‌త ఆయ‌కే సొంతం... 1995 లో ముఖ్య‌మంత్రి హ‌యాంలో ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ఉన్న జిల్లాల‌ను త‌న అధికార బ‌లంతో క్ర‌మ క్ర‌మంగా గుప్పెట్లోకి తెచ్చుకున్నారు... దీంతో పాటు అనేక మంది ప్ర‌తి ప‌క్ష నేత‌ల‌ను కోట్ల రూపాయ‌లు కుమ్మ‌రించి తెలుగు దేశం పార్టీ లోకి చేర్చుకున్నారు... 
 
2014 ఎన్నిక‌ల్లో టీడీపీ  ప్ర‌భుత్వం అధికారాన్ని చేజిక్కించుకున్నాక వారి అధికార బ‌లంతో విచ్చ‌ల‌విడిగా అవినీతి అక్ర‌మాలకు పాల్ప‌డుతోంద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి రాష్ట్రంలో అనేకమంది తెలుగుదేశం నాయ‌కుల‌పై నేరుగా విమ‌ర్శ‌లు చేస్తున్నారు ఇక వైసీపీ అయితే ఎప్ప‌టిక‌ప్పుడు వీరి చ‌ర్య‌ల‌ను ఎండ‌గ‌డుతోంది. ఇక దేశంలోనే అవినీతిలో మొద‌టి రాష్ట్రాంగా చేశారు త‌మ్ముళ్లు.
 
అయితే ఈ క్ర‌మంలో ముఖ్య‌మంత్రి చంద్రబాబు కొద్ది రోజుల క్రితం త‌న 40 వ‌ రాజ‌కీయ అరంగేట్రాన్ని పూర్తి చేసుకున్నారు... త‌న రాజ‌కీయ అనుభ‌వంలో  ఎంతో మంది నాయ‌కుల చ‌రిత్ర‌ను తిర‌గ రాసిన ఘ‌నత ముఖ్య‌మంత్రికి మాత్ర‌మే ద‌క్కుతుంది... అంత‌టి ఘ‌న‌త ఉన్న చంద్ర బాబు ఒక్క జిల్లాను మాత్రం త‌న గుప్పెట్లోకి తెచ్చుకోలేక పోతున్నారు...  ముఖ్య‌మంత్రి ప‌ద‌విలో ఉన్నా లేకున్నా క‌డ‌ప జిల్లా మాత్రం చంద్రబాబును నిద్ర ప‌ట్ట‌కుండా చేస్తోంది...
 
ఈ జిల్లాలో ముఖ్య‌మంత్రి ఎక్క‌డా చేయ‌ని అభివృద్ది కార్య‌క్ర‌మాలు చేశారు అని జిల్లా తెలుగుదేశం నాయ‌కులు ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌గ‌ల్బాలు పలుకుతున్నా, ఇక్క‌డ తెలుగుదేశం మాత్రం త‌న హావా చూప‌లేక‌పోతోంది అనే చెప్పాలి.. ఇక్క‌డ తెలుగుదేశం త‌న హావా చూప‌లేక‌పోతోంది......క‌డ‌ప‌ జిల్లాలో టీటీపీ జెండాను రెప‌రెప‌లాడించాల‌నుకున్న చంద్రబాబు ప్ర‌య‌త్రాల‌న్ని విఫ‌లం అవుతూనే ఉన్నాయి.
 
వైఎస్ కుటుంబానికి కంచుకోటలా ఉన్న ఈ జిల్లాను త‌న గుప్పెట్లో తెచ్చుకునేందుకు  విశ్వ‌ ప్ర‌య‌త్నాలు చేస్తున్నా కానీ, చంద్రబాబు త‌న ఆధిప‌త్యాన్ని  చెలాయించ‌లేక పోతున్నారు... అయితే ఈ క్ర‌మంలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న త‌రుణంలో బాబు జిల్లా వ్యాప్తంగా నాయ‌కుల‌తో సమాలోచ‌న‌లు చేసి  చ‌ర్చిస్తున్నారు.. దీంతో పాటు క‌డ‌ప టీడీపీ మంత్రుల‌ను, ఇన్ చార్జ్ ల‌ను పిలిపించి ఒక చ‌ర్చ ఏర్పాటు చేశార‌ట చంద్ర బాబు... ఈ చ‌ర్చ‌లో వ‌చ్చే ఎన్నిక‌ల‌లోపు క‌డ‌ప జిల్లాలో మార్పు తీసుకురావాల‌ని బాబు వారిని ఆదేశించిన‌ట్లు తెలుస్తోంది... వైఎస్ కంచుకోట‌ను తిర‌గ రాసేందుకు ఎంత ఖ‌ర్చు అయినా వెనుకాడ‌వ‌ద్ద‌ని ముఖ్య‌మంత్రి సూచించార‌ట జిల్లా నాయ‌కుల‌కు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.