సోషల్ మీడియా దెబ్బకు చంద్ర‌బాబు, మీడియా హడల్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu and social media
Updated:  2018-08-30 01:03:04

సోషల్ మీడియా దెబ్బకు చంద్ర‌బాబు, మీడియా హడల్

గుట్టుగా కొన్ని దశాబ్దాల తరబడి తన సొంత సామాజికవర్గానికి చెందిన మీడియా సహాయంతో తన అవినీతిని కప్పి పుచ్చుకుంటూ తనని ఒక గొప్ప అనుభవజ్ఞుడిగానూ, గొప్ప పరిపాలనాదక్షుడిగానూ చిత్రీకరించుకుంటూ, జనాలను ఏమారుస్తూ పబ్బం గడుపుకున్న ముఖ్య‌మంత్రి చంద్రబాబు పాలిట సింహస్వప్నంగా మారుత‌న్న సోషల్ మీడియాను చంద్రబాబు సహించలేకపోతున్నార‌ట ప్ర‌స్తుతం.
 
రాజధానిపేరిట జరిగిన భూ దోపిడీలు, కాల్ మనీ సెక్స్ రాకెట్ ఉదంతాలు, అలాగే ఇసుక, మట్టి, పోలవరం, పట్టిసీమ పేరిట నిధులను దిగమింగడాలు, ఓట్ల బేరాలు, ఫిరాయింపులు, అక్రమ మైనింగ్, ప్రత్యేక హోదాపై నాటకాలు, పగలు BJP తోనూ, రాత్రివేళ కాంగ్రెస్ తోనూ ఆడిన నాటకాలు, సీమాంధ్రలో దోచుకుని పెట్టుబడుల వేట ముసుగులో విదేశాల్లో దాచుకున్న బాగోతాలు సోష‌ల్ మీడియాలు ఎండ‌గ‌డుతున్నాయి. అలాగే శ్రీవారి వజ్రాలవేలాలు, దుర్గమ్మ పట్టుచీరల దొంగతనాలు, చినబాబు కోసం జరిపిన తాంత్రిక పూజలు, పాతకేసులు, 18 స్టేలు తదితర అక్రమాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వెలుగులోకి తెస్తూ నిలదీయ‌డం నారావారికి నచ్చడం లేదు.
 
అన్నింటికి మించి తనలాగే తన కుమారుడిని కూడా తన అనుకూల" మీడియా రక్షణలో జనం మీదకు రుద్దాలనుకున్న ఎత్తుగడలకు సోషల్ మీడియా కళ్ళెం వేయడం అస్సలు జీర్ణించుకోలేకపోతున్నార‌ట ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు. తన కుమారుని అసమర్దతనూ, అపరిపక్వతను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ఎండగట్టడం మింగుడుపడని చంద్రబాబు ఎలాగైనా సోషల్ మీడియాని నియంత్రించాలన్న లక్ష్యం తో పలువురు నెటిజన్‌లను అక్