టీడీపీని ఇరుకున పెడుతున్న విజ‌య‌సాయిరెడ్డి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-26 15:09:16

టీడీపీని ఇరుకున పెడుతున్న విజ‌య‌సాయిరెడ్డి

వైసీపీ రాజ్య‌స‌భ‌ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి త‌న పొలిటిక‌ల్ పందా మార్చారు.. మ‌రీ ముఖ్యంగా తెలుగుదేశం నాయ‌కుల ఆశ‌లు అడియాశ‌లు చేస్తున్నారు ఆయ‌న‌.. దేశ రాజకీయాల్లో 40 ఇయ‌ర్స్ అని చెప్పుకునే బాబుగారు కూడా విజ‌య‌సాయిరెడ్డి నాలుగేళ్ల రాజ‌కీయాల‌కి టెన్ష‌న్ ప‌డుతున్నారు..అయితే 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ వ్య‌క్తికి వైసీపీ ఎంపీలు రాజీనామా చేసిన చోట‌ ఉప ఎన్నిక‌లు వ‌స్తాయా లేదా అనేది డైల‌మాలో ఉంది.. ఇది ఇలా ఉంటే  తాము మాత్రం పార్టీ త‌ర‌పున ఉప ఎన్నిక‌లు వ‌స్తే ఎదుర్కోవ‌డానికి సిద్దంగా ఉన్నామ‌ని చెప్పారు విజ‌య‌సాయిరెడ్డి..
 
కాంగ్రెస్లో ఖ‌ర్గే, అహ్మ‌ద్ ప‌టేల్ లా సీడబ్లూసీ మెంబ‌ర్లు ఎంత‌లా పార్టీకి ప్ర‌తీ దానిలో వెన్నంటి ఉంటారో.. అలా వైసీపీకి విజ‌య‌సాయిరెడ్డి వెన్నంటి ఉంటున్నారు... ఇటు జ‌గ‌న్ ప్ర‌త్య‌క్ష రాజకీయాల్లో బిజిగా ఉంటే తెర‌వెనుక చ‌క్రం తిప్పుతున్న తెలుగుదేశం నాయ‌కుల‌కు మంచి ఝ‌ల‌క్ ఇస్తున్నారు విజ‌య‌సాయిరెడ్డి... ఇటీవ‌ల ప్ర‌కాశంలో కూడా ఓ వైసీపీ నాయ‌కుడికి టీడీపీ గాలం వెయ్యాలి అని ఆలోచించింది.. ఆ ఆఫ‌ర్లకు నాయ‌కుడు చేజారిపోకుండా బ‌య‌ట‌కు రాకుండానే వైసీపీ స‌రైన ఫ్లాన్ తో దెబ్బ కొట్టింది. ముఖ్యంగా ప్ర‌కాశంలో ఆధిప‌త్య పోరుతో ఇప్ప‌టికే టీడీపీలో ఓ వ‌ర్గం దూరం అవుతుంటే, మ‌రో వ‌ర్గం టిక్కెట్లు వ‌స్తాయా లేదా అనే డైల‌మాలో ఉంది
 
ఇక విజ‌య‌సాయ‌రెడ్డి ఉప ఎన్నిక‌ల పై ప్ర‌క‌ట‌న చేయ‌డం, ఉప ఎన్నిక‌లు వ‌స్తే ఐదుగురు ప్ర‌త్యేక హోదా పై రాజీనామా చేశారు క‌నుక సెంటిమెంట్ క‌నిపిస్తే, ఓట్లు అన్నీ వైసీపీకి లాభిస్తే హ‌త విది మ‌న ప‌రిస్దితి ఎలా ఉంటుంది అని టీడీపీ మ‌ద‌న‌ప‌డుతోంది..ఉన్నా 25 ఎంపీ సెగ్మెంట్లు  అలాగే 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో మ‌న స్దితి ఏమిటా అని ఆలోచ‌న‌లో ఉంది తెలుగుదేశం పార్టీ.. ఇటు విజ‌య‌సాయిరెడ్డి మాత్రం స‌వాల్ రాజా అంటూ టీడీపీకి కాస్కో మ‌ని చెబుతున్నారు. మ‌రో ప‌క్క ఈసీ దీనిపై ఎటువంటి నిర్ణ‌యం తీసుకుంటుందా అనే ఆలోచ‌న  మాత్రం టీడీపీకి రోజు రోజుకు పెరిగిపోతోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.