బాబు ఫైర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-10 18:34:22

బాబు ఫైర్

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఏ జిల్లాకు ప‌ర్య‌టించినా కానీ ప్ర‌త్య‌క్షంగా లేక ప‌రోక్షంగా ఎదురు దెబ్బలు త‌గులుతూనే ఉన్నాయి. ఇక తాజాగా ఈ రోజు ఆయ‌న కర్నూల్ జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా చంద్ర‌బాబు ఓర్వ‌క‌ల్ వ‌ద్ద జయరాజ్‌ ఇస్పాత్‌ స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
 
ఆ త‌ర్వాత చంద్ర‌బాబు మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వ‌చ్చాక రాయ‌లసీమను సస్య‌శ్యామ‌లం చేశామ‌ని చెప్పుకొచ్చారు. అయితే ఈ క్రమంలో ఓ మీడియా ప్ర‌తినిధి కేవ‌లం టీడీపీ నాయ‌కులు శంకుస్థాపనలకే పరిమితయ్యారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని అడుగగా. ఈ విష‌యం పై ఎంతో ఆగ్ర‌హంతో మాట్లాడారు చంద్ర‌బాబు. గ‌తంలో ప్ర‌తిప‌క్ష‌నేత‌లు అధికారంలో ఉన్న‌ప్పుడు రాష్ట్రాన్ని ఏం పీకార‌ని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. తాము చేస్తున్న అభివృద్ధి ప్రతిపక్షాలకు కనబడటం లేదా అని చంద్ర‌బాబు విమ‌ర్శించారు.
 
అయితే ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై ప్ర‌తిప‌క్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు స్పందించారు.. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం ఇంతవరకూ అధికారంలోకి రాలేదన్న విషయాన్ని చంద్రబాబు మ‌ర్చిపోయా రేమోన‌ని వైసీపీ నాయులు విమ‌ర్శిస్తున్నారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని ఈ కేసు నుంచి త‌ప్పించుకునే క్ర‌మంలో చంద్ర‌బాబు ఏం మాట్లాడాలో తెలియ‌క స‌త‌మ‌తమవుతున్నార‌ని వైసీపీ నాయ‌కులు విమ‌ర్శిస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.