బాబు టీడీపీ మంత్రుల‌పై ఫైర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-25 13:10:59

బాబు టీడీపీ మంత్రుల‌పై ఫైర్

2019లో హోరా హోరీగా జ‌రిగే ఎన్నిక‌ల్లో ఏపీ ముఖ్య‌మంత్రి అధికార తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు బ‌ద్ద‌శ‌త్రువు అయిన కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోనున్నార‌ని కొద్ది కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.
 
అంతేకాదు ఇటీవ‌లే కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా చంద్ర‌బాబు నాయుడు కుమారుడు మంత్రి నారా లోకేశ్ భార్య బ్రాహ్మ‌ణి రాహుల్ ను క‌లిశారు. ఉద్దేశ‌పూర్వ‌కంగానే ఆమె రాహుల్ ను క‌లిశార‌ని వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ టీడీపీ నాయ‌కులు పొత్తు పెట్టుకోవ‌డం ఖాయం అని అంద‌రు భావిస్తున్నారు. 
 
అయితే ఇదే విష‌యాన్ని ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కూడా తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. దీంతో సీనియ‌ర్ నాయ‌కులు ఆగ్ర‌హించి పొత్తుల‌పై స్పందించారు. గతంలో కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అంత‌మొందించేందుకు పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అయితే ఇప్పుడు చంద్ర‌బాబు నాయుడు పొత్తుపెట్టుకునేందుకు రెడి అయ్యార‌ని మంత్రి అయ్య‌న్న పాత్రుడు మండిప‌డ్డారు.
 
 ఇక ఇదే క్ర‌మంలో డిప్యూటీ ముఖ్య‌మంత్రి కేఈ కృష్ణ మూర్తి కూడా స్పందించారు. వ‌చ్చేఎన్నిక‌ల్లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే తాను ఉరి వేసుకుంటాన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 
 
ఇక వీరు చేసిన వ్యాఖ్య‌ల‌పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఫైర్ అయ్యారు. పొత్తుల‌పై ఎలాంటి చ‌ర్చ జ‌రుగ‌కుండానే ఎందుకు మాట్లాడుతున్నార‌ని ఆయ‌న ఫైర్ అయ్యారు. పొత్తుల‌కు సంబంధించి టీడీపీ పొలిటిక‌ల్ బ్యూరో నిర్ణ‌యాలు తీసుకుంటార‌న్న విష‌యం కూడా టీడీపీ సీనియ‌ర్ నాయకుల‌కు తెలియ‌క పోతే ఎలా అని చంద్ర‌బాబు నాయుడు క్లాస్ తీసుకున్నారు. పొత్తుల విషయంలో ఓ నిర్ణయం తీసుకునే వరకు ఈ విషయంలో ఎవరూ మాట్లాడవద్దని సూచించారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.