ఆ నోటిదుర‌ద ఎంపీకి బాబు చివాట్లు ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu naidu image
Updated:  2018-03-10 03:13:08

ఆ నోటిదుర‌ద ఎంపీకి బాబు చివాట్లు ?

తెలిసీ తెలియ‌క మాట్లాడే మాట‌లు పార్టీకి ఎంత న‌ష్టం క‌ష్టం తెస్తాయో ఇటీవ‌ల తెలుగుదేశంలో జ‌రిగిన ప‌రిణామాల‌తో బ‌హిరంగం అవుతున్నాయి.. ఓ ప్ర‌క్క‌న ప్ర‌తిప‌క్ష నేత  జ‌గ‌న్,  సీఎం చంద్ర‌బాబు పై తెలుగుదేశం పై ఫైర్ అవుతూనే ఉన్నారు..  ఏపీకి ఎటువంటి నిధులు, ప్ర‌త్యేక హూదా ఇవ్వ‌ని బీజేపీతో ఎందుకు క‌లిసి వెళుతున్నారు అని ప్ర‌శ్నిస్తూనే ఉన్నారు. ఇక ఏపీలో కూడా ఎటువంటి అభివృద్ది జ‌రుగ‌డం లేద‌ని, కేంద్రం సాయం చేయ‌డం లేద‌ని తెలుగుదేశానికి తెలిసి వ‌చ్చింది... ఇక కేంద్ర‌మంత్రి అరుణ్ జైట్లీ కూడా ఏపీకి ఎటువంటి ప్ర‌త్యేక హూదా ఇచ్చేది లేదు అని చెప్ప‌డంతో, వెంటనే కేంద్రం నుంచి బ‌య‌ట‌కు రావాలి అని స‌దరు తెలుగుదేశం నాయ‌కులు తేల్చిచెప్పారు.
 
అయితే ఓ ప‌క్క కేంద్రం నుంచి త‌మ‌కు బ‌య‌ట‌కు రావ‌డం ఇష్టం లేక చంద్ర‌బాబు నాలుగు సంవ‌త్స‌రాలుగా అలాగే కొన‌సాగారు అనే వెర్ష‌న్ వినిపించింది ఇప్ప‌టి వ‌ర‌కూ.. చివ‌ర‌కు ఓ ఎంపీ దీనిపై  దుర‌ద వ్యాఖ్య‌లు చేశారు అని అంటున్నారు తెలుగుదేశం నాయ‌కులు.. అస‌లు కేంద్రంలో కొన‌సాగ‌టానికి ఇష్ట‌ప‌డ‌టం లేద‌ని మిత్ర ప‌క్షంగా ఉండ‌కూడ‌దు అనేలా ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు.. చివ‌ర‌కు బీజేపీ అధిష్టానానికి కూడా స‌ద‌రు తెలుగుదేశం ఎంపీ వ్యాఖ్య‌లు వెళ్లాయి.. చివ‌ర‌కు బీజేపీ అధిష్టానం కూడా ఏపీలో తెలుగుదేశం నాయ‌కులు గ‌త నెల నుంచి ఎటువంటి దోర‌ణి బీజేపీ పై ప్ర‌వ‌ర్తిస్తున్నారో చూస్తూనే ఉన్నారు.. దీంతో అయిష్టంగానే చంద్రబాబు కేంద్రం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు అని నేత‌లు అనుకుంటున్నారు.
 
ఇక తాజాగా స‌ద‌రు ఎంపీ ఏకంగా ఎన్డీఏ నుంచి కూడా బ‌య‌ట‌కు రావాలి అని అప్పుడే ప్ర‌జ‌లు మ‌న‌ల్ని న‌మ్ముతారు అని  అనేక కామెంట్లు చేశారు... దీంతో అస‌లుకే మోసం వ‌చ్చే ప్ర‌మాదం ఉంది అని స‌ద‌రు ఎంపీకి బాబు సున్నితంగా తెలియ‌చేశార‌ట.. ఈ ప‌ని వ‌ల్లే చివ‌ర‌కు ఇంత వ‌ర‌కూ వ‌చ్చింది అని చివాట్లు పెట్టార‌ట.. స‌దరు ఎంపీ ప‌ద్ద‌తి పై తెలుగుదేశం నాయ‌కులు కూడా చ‌ర్చించుకున్నారు అట.. ఇది తెలుగుదేశం లో వైర‌ల్ అవుతున్న  వార్త... ఆ ఎంపీ ఎప్పుడూ వార్త‌ల్లో నిలుస్తారు అని అంటున్నారు నాయ‌కులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.