రామ‌సుబ్బారెడ్డికి లైన్ క్లియ‌ర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-22 17:29:56

రామ‌సుబ్బారెడ్డికి లైన్ క్లియ‌ర్

శుభం ప‌ల‌క‌రా అంటే ఏదో అన్నాడ‌ని క‌డ‌ప జిల్లాలో తెలుగుదేశం జెండా రెప‌రెప‌లాడాలి అనే త‌లంపుతో ఉంది పార్టీ.. అయితే తెలుగుదేశం ఆ ఊహాల‌కు అంద‌నంత ఎత్తుగా ఊహించుకుంటోంది.. భ‌విష్య‌త్ ప్ర‌శ్నార్ధ‌కంగా ఉందిరా అంటే ప్యూచ‌ర్ లో, 2050 వ‌ర‌కూ నేనే సీఎం అని ఈయ‌న సెల‌విస్తున్నారు... బ‌హుశా అది తెలుగుదేశం నాయ‌కులు కూడా గొప్ప‌గా చెప్పుకుంటున్నారు. క‌రుణానిధి - జ్యోతిబ‌సు రికార్డులు కూడా చంద్ర‌బాబు తిర‌గ‌రాసిన‌ట్టే అని త‌మ్ముళ్లు బ‌ల్ల‌లు చ‌రుస్తున్నారు.
 
అయితే క‌డ‌ప పేరు చెప్ప‌గానే తెలుగుదేశానికి అదో ఆనందం, ఇప్పుడు క‌డ‌ప అంతా మ‌న‌వాళ్లు ఏలుబ‌డికి రెడీగా ఉన్నారు అని భావిస్తుంది.. అయితే నాటి రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఎమ్మెల్యే స్టేజ్ నుంచి, నేటి జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష పాల‌న వ‌ర‌కూ అంతా వైయ‌స్ కంచుకోట.. అయితే 2014 ఎన్నికల్లో వైసీపీ త‌ర‌పున ఎమ్మెల్యే సీటు తీసుకున్న జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యే కం మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి తెలుగుదేశం లోకి పార్టీ ఫిరాయించారు..
 
ఇక ఫిరాయించి మంత్రి ప‌ద‌వి తీసుకున్నారు.. జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు పెంచారు, అయితే ఎన్ని విమ‌ర్శ‌లు చేసినా ఎంత తిట్లు- తిట్టినా తెలుగుదేశం త‌ర‌పున వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌మ్మ‌ల‌మ‌డుగు నుంచి రామ‌సుబ్బారెడ్డికి టికెట్ ఇవ్వ‌డానికి తెలుగుదేశం రెడీ అవుతోంది.. ఇటు బాబు కూడా ఆలోచ‌న‌ అదే అని తెలుస్తోంది అయితే రామ‌సుబ్బారెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నా, త‌న ఎమ్మెల్సీకి రాజీనామా అయినా చేస్తాను కాని, తాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు వ‌దులుకోను అంటున్నారు.. 
 
ఇటు చంద్ర‌బాబు కోట‌రీలో రామ‌సుబ్బారెడ్డి ఉంటే, లోకేశ్ కోట‌రిలో ఆదినారాయ‌ణ రెడ్డి ఉన్నారు.. వీరి ఇరువురిని రాజ‌కీయంగా ఎదుర్కొనాలి అని వైసీపీ త‌ర‌పున ప్ర‌త్య‌ర్ది వ‌ర్గం రెడీ అవుతోంది.. అయితే సుధీర్ రెడ్డి పార్టీ త‌ర‌పున ఉన్నా వ‌చ్చే ఎన్నిక‌ల్లో నిల‌బ‌డే అభ్య‌ర్ది ఎవ‌రు అనేది మాత్రం వైసీపీ ఇంకా ఆలోచిస్తోంది.
 
అయితే మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి జ‌గ‌న్ పై-  వైయ‌స్ ఫ్యామిలీ పై బుర‌ద‌చ‌ల్ల‌డంలో దిట్ట... ఒక‌వేళ జ‌మ్మ‌ల‌మ‌డుగులో వైయ‌స్ ఫ్యామిలీ నిల‌బ‌డితే ఆదినారాయ‌ణ రెడ్డి ఎదిరించ‌లేడు అందుకే, క‌డ‌ప ఎంపీ అభ్య‌ర్దిగా ఆదినారాయ‌ణ రెడ్డిని తెలుగుదేశం త‌ర‌పున నిల‌బెట్టాలి అని ఆలోచిస్తున్నారు బాబు... దీనికి చిన‌బాబు ఎస్ చెప్ప‌లేద‌ట, అంతే కాదు క‌డ‌ప ఎంపీగా నిల‌బ‌డ‌క‌పోతే నెక్ట్స్ ఎల‌క్ష‌న్ కి రెస్ట్ తీసుకో అని చెబుతున్నారు అని కూడా చ‌ర్చించుకుంటున్నారు జిల్లా తెలుగుదేశం నాయ‌కులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.