మ‌రో సంచ‌ల‌నానికి బాబు రెడీనా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu image 5
Updated:  2018-03-09 07:10:56

మ‌రో సంచ‌ల‌నానికి బాబు రెడీనా

హ‌స్తిన‌లో కూడా ఏపీ రాజ‌కీయాలు కాక‌పుట్టిస్తున్నాయి.. పార్ల‌మెంట్ స‌మావేశాలు పూర్తి అయ్యేలోపు  ఏపీకీ ప్ర‌త్యేక హూదా సాధించుకోవాలి అనే ఆలోచ‌న‌లో ఉంది తెలుగుదేశం పార్టీ వైసీపీ...  అలాగే కాంగ్రెస్ కూడా ఏపీకి సాయం చేస్తాం అంటూ ముందుకు వ‌స్తోంది.. ఇక ఈ స‌మావేశాల్లో బీజేపీని ఇరుకున పెట్టాలి అని బీజేపీ యాంటీ ప‌క్షాలు అన్ని రెడీ అవుతున్నాయి... అయితే మోదీ అమిత్ షా మాత్రం డోంట్ కేర్ అంటున్నారు.
 
ఇక కేంద్ర మంత్రి వ‌ర్గం నుంచి త‌మ ఎంపీలు ఇద్ద‌రిని వెన‌క్కి తీసుకుని, రాజీనామా చేయించారు సీఎం చంద్ర‌బాబు. దీనిపై అంద‌రికి ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌లేదు, ఎందుకంటే  ఇటు శివ‌సేన‌- అకాలీద‌ళ్  కూడా ఎన్డీయే నుంచి  బ‌య‌ట‌కు వచ్చాయి.. ఒక్కో మిత్ర ప‌క్షం బీజేపీకి స‌రైన కార‌ణాలు చూపి బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి... ఎన్డీఏ నుంచి ఇప్పుడు చంద్ర‌బాబు కూడా ఇద్ద‌రు త‌మ పార్టీ ఎంపీల‌ను మంత్రి ప‌ద‌వుల నుంచి రాజీనామాలు మాత్ర‌మే చేయించారు అంతే కాని ఎన్డీఏ కూట‌మి నుంచి తాము బ‌య‌ట‌కు రాలేదు అని మీడియా ముఖంగా తెలియ‌చేశారు చంద్ర‌బాబు. 
 
అయితే సుజ‌నా చౌద‌రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు ప్ర‌ధాని మోదీకి  రాజీనామాలు ఇచ్చే స‌మ‌యంలో,  మోదీ కూడా ఎటువంటి ఆపే ప్ర‌య‌త్నం చేయ‌లేదు అనేది తాజాగా తెలుగుదేశాన్ని బాధిస్తోంది.. బీజేపీ కూడా తెలుగుదేశం మిత్ర‌బంధం అవ‌స‌రం లేదు అనే నిర్ణ‌యానికి వ‌చ్చింది అనేది అంద‌రికి అర్దం అయిపోయింది....ఇటు కేసీఆర్  థ‌ర్డ్ ఫ్రంట్ కు బాబు కూడా స‌పోర్ట్ ఉంటారు అని, రెండూ ఒకే తాను ముక్క‌లు అనేలా రాజీక‌యాల్లో మోదీ - అమిత్ షాకి తెలియ‌ని ఎత్తుగ‌డ కాదు ఇది.
 
ఇటు తెలుగుదేశాన్ని ఇచ్చిన నిధుల‌కు లెక్క‌లు చెప్పండి అని బీజేపీ సెంట‌ర్ చేయ‌డం, అలాగే బీజేపీ సాయం చేయ‌డం లేదు  అని బీజేపీని తెలుగుదేశం మ‌ధ్య‌లో ఇరికించ‌డం అడ‌క‌త్తెర‌లో పోక‌చెక్క‌లా ఇరువురు ఇరుక్కునేలా చేసింది... తెలుగుదేశానికి బీజేపీకి మ‌ధ్య వార్ ను మరింత పెంచింది.. ఇక చంద్ర‌బాబు  ఎన్డీఏలో కొన‌సాగుతున్నా అని మీడియా ముఖంగా చెప్పారు.
 
అలాగే కేంద్ర మంత్రి వ‌ర్గం నుంచి మ‌న ఎంపీలు బ‌య‌టకు  రావ‌డం వ‌ల్ల, మ‌న‌కు క‌ల‌సి వ‌చ్చేది లేదు, బీజేపీకి పోయింది లేదు.. వారే మ‌రో ఇద్ద‌రికి అవ‌కాశం ఇచ్చేలా చేశారు ఇటు విమాన‌యాన శాఖ‌ను పీఎం త‌న వ‌ద్దే ఉంచుకున్నారు.
 
అయితే ఇక్క‌డ బీజేపీ పై ఎటువంటి ప్ర‌చారం చేసినా తెలుగుదేశానికి పైసా ప్ర‌యోజ‌నం లేదు....ఇక సంవ‌త్స‌రం మాత్ర‌మే ఎన్నిక‌ల‌కు  స‌మ‌యం ఉంది... ఇటు ప్ర‌తిప‌క్షం వైసీపీని ఎదుర్కోవాలి, కూర‌లో క‌రివేపాకులా మ‌రో పార్టీని వాడ‌కుని వ‌దిలేశారు అనేలా జ‌న‌సేనాని కూడా మ‌ద‌న ప‌డుతున్నారు... ఆయ‌న కూడా స్వ‌తంత్రంగా ఎద‌గాలి అని పోటీ చేయాలి అని యోచిస్తున్నారు.
 
ఇటు కాంగ్రెస్ కూడా చిరంజీవి లాంటి నాయ‌కుడు పార్టీని న‌డుపుతారా మాకు సెల‌బ్రెటీలు కావాలి  అలా  న‌డిపితే  తాము పార్టీకి కృషి చేస్తాం అంటున్నారు... అయితే ఇటు ఎన్డీఏ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ముఖ్యమంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసి ముంద‌స్తు ఎన్నిక‌లకు వెళ్లే ఆలోచ‌న  బాబు చేయ‌వ‌చ్చు.
 
ఇదే ఫార్మూలా 2004 లో మైన‌స్ అయింది బాబుకు... అప్పుడు పాద‌యాత్ర ఎఫెక్ట్ కొట్టింది.. ఇక ప‌వ‌న్ జ‌గ‌న్ వార్ కూడా తెలుగుదేశానికి ఎఫెక్ట్ కొట్టేలా క‌నిపిస్తోంది. మ‌రి ఇంకా సంవ‌త్స‌రం మాత్ర‌మే  ఎన్నిక‌లకు స‌మ‌యం ఉంది.  ఈ స‌మ‌యంలో పార్టీ త‌ర‌పున ఇటువంటి డెసిష‌న్ బాబు తీసుకుంటారా?  అది సాధ్య‌మా అనేది కూడా కాస్త ఆలోచించ‌ద‌గ్గ విష‌య‌మే.
 
విశ్లేష‌ణ 
గ‌ణేష్ వ‌జ్ర‌పు

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.