రోజాకు పోటీగా టీడీపీ అభ్య‌ర్థి ఆమె

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ysrcp mla roja
Updated:  2018-07-04 05:37:45

రోజాకు పోటీగా టీడీపీ అభ్య‌ర్థి ఆమె

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు త‌న సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో 2019 ఎన్నిక‌ల్లో ఎలాగైనా ప‌ట్టు సాధించాల‌నే క్ర‌మంలో స‌రికొత్త ప్లాన్లు వేస్తున్నార‌ని తెలుస్తోంది. ఎన్టీఆర్ త‌ర్వాత‌ చంద్ర‌బాబు నాయుడు టీడీపీ బాధ్య‌త‌ల‌ను తీసుకున్న‌ప్ప‌టి నుంచి త‌న సొంత జిల్లాలో ప‌ట్టు సాధించుకోలేక పోతున్నారు. 
 
దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హయాంలో కూడా చిత్తూరు లో టీడీపీ ఘోర ప‌రాజ‌యం ఎదుర్కొంది. ఇక తెలుగు రాష్ట్రాలు విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత కూడా ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చిత్తూరు జిల్లాలో త‌న జెండాను ఎగ‌రవేశారు. తండ్రికొడుకుల చేతిలో ఘోర ప‌రాజ‌యం ఎదుర్కొన్నాన‌నే బాద‌తో ఎలాగైనా వ‌చ్చే ఎన్నిక‌ల్లో చిత్తూరు జిల్లాలో ప‌ట్టు సాదించాల‌నే ఉద్దేశ్యంతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయ‌డు స‌రికొత్త వ్యూహ‌లు ర‌చిస్తున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.
 
అందులో భాగంగానే న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం వైపు చంద్ర‌బాబు క‌న్నేశార‌ట‌. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  ఫైర్ బ్రాండ్ రోజా ఎమ్మెల్యే గా ఉన్నారు. ఇక వ‌చ్చే ఎన్నికల్లో రోజా నోటికి తాళం వేయాల‌నే నేప‌థ్యంతో చంద్ర‌బాబు టీడీపీ త‌ర‌పున లేడీ అభ్య‌ర్థిని బ‌రిలోదించేందుకు సిద్ద‌మ‌య్యారు. న‌గ‌రిలో టీడీపీ త‌ర‌పున లేడీ అభ్య‌ర్థిని నిల‌బెడితే చిత్తూరు జిల్లాలో టీడీపీ కాస్త ఊపు అందుకుంటుంద‌నే భావంతో చంద్ర‌బాబు ఇలాంటి నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌. ఈ క్ర‌మంలో  సినీ ఇండ‌స్ట్రీకి చెందిన వాణీవిశ్వ‌నాథ్ ను చంద్ర‌బాబు నాయుడు ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది. 
 
న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో వాణీవిశ్వ‌నాథ్ ను బ‌రిలోకి దింపితే రోజాకు స‌రైన అభ్య‌ర్థిని బ‌రిలోకి దింపిన‌ట్లు అవుతుంద‌ని భావించి చంద్ర‌బాబు ఆమెకు సీటు క‌న్ఫాన్ చేయ‌వ‌చ్చ‌ని వార్తలు వ‌స్తున్నాయి. గతంలో కూడా వాణీవిశ్వ‌నాథ్, చంద్ర‌బాబు నాయుడు త‌న‌కు అవ‌కాశం ఇస్తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో రోజాకు వ్య‌తిరేకంగా పోటీ చేస్తాన‌ని చెప్పిన సంగ‌తి తెలిసిందే. 
 
అయితే వాస్త‌వానికి గాలిముద్దు కృష్ణ‌మ నాయుడు వ‌చ్చే ఎన్నికల్లో టీడీపీ త‌ర‌పున న‌గ‌రిలో బ‌రిలోకి దిగాలి కాని ఆయ‌న అకాల మ‌ర‌ణం చెంద‌డంతో 2019 ఎన్నిక‌ల్లో వాణీవిశ్వాథ్ కు టికెట్ ఇచ్చి ముద్దు కృష్ణ‌మ‌నాయుడు భార్య సరస్వతమ్మకు టీడీపీ అధికారంలోకి వ‌స్తే ఎమ్మెల్సీ ఇచ్చేందుకు సిద్ద‌మ‌య్యారట చంద్ర‌బాబు. ఒకవేళ ఆయ‌న వాణీవిశ్వ‌నాథ్ కు సీటక‌న్ఫామ్ చేస్తే  నియోజ‌క‌ర్గంలోకి టీడీపీ నాయ‌కుల‌కు ముద్దుకృష్ణ‌మ నాయుడు అనుచ‌రుల‌కు అంత‌ర్ యుద్దం జ‌ర‌గం ఖాయం అని తెలుస్తోంది.
 
మ‌రోవైపు వైసీపీ ఎమ్మెల్యే రోజా త‌న నియోజ‌క‌వ‌ర్గానికి ఎమ్మెల్యే ఫండ్స్ వ‌చ్చే వ‌ర‌కు వెయిట్ చేయ‌కుండా ప్ర‌జాసేవే త‌న సేవ అనేభావంతో నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తీ గ్రామానికి తిరిగి ప్ర‌జ‌ల‌ స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం దొరికేలా మార్గం చూపుతున్నారు. దీంతో టీడీపీ ఓటు బ్యాంకింగ్ కూడా వైసీపీలోకి చేర్చుకుంటున్నారు రోజా. దీన్ని బ‌ట్టి చూస్తుంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు వాణీవిశ్వనాథ్ ను బ‌రిలోకి దించినా, లేకా త‌న కొడుకుని బ‌రిలోకి దింపినా కూడా రోజా విజ‌యం ఖాయం అని తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.