రాష్ట్ర రాజ‌కీయాల‌కు చంద్ర‌బాబు గుడ్ బై

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-04 11:46:37

రాష్ట్ర రాజ‌కీయాల‌కు చంద్ర‌బాబు గుడ్ బై

సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న స‌మ‌యంలో అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు బ‌యాందోల‌ళ‌న‌కు గురి అవుతున్నారా అంటే అవున‌నే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. అయితే ముఖ్యంగా ఈ విష‌యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు టెన్ష‌న్ టెన్ష‌న్ గా ఉన్నార‌ట‌.
 
తాము వ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తామా లేదా ప్ర‌జ‌లు టీడీపీ ఎమ్మెల్యేల‌పై ఏమ‌నుకుంటున్నారు టీడీపీ ప‌రిపాల‌న ఏవిధంగా ఉంది అనే విష‌యంపై చంద్రబాబు దీర్ఘంగా ఆలోచిస్తున్నార‌ట‌. ఎందుకంటే వ‌చ్చే ఎన్నిక‌లు ఇటు అధికార పార్టీ నాయ‌కులకు అయినా అటు ప్ర‌తిప‌క్ష పార్టీ నాయ‌కులకు అయినా 2019 లో గెలుపు అనేది కీల‌కం. అందుకే ప్ర‌తిప‌క్షనేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎర్రని ఎండ‌ని సైతం లెక్కచేయ‌కుండా ప్ర‌తిష్టాత్మ‌కంగా పాద‌యాత్ర చేస్తున్నారు. 
 
ఈ పాద‌యాత్ర రాయ‌ల‌సీలోని నాలుగు జిల్లాల‌ను అలాగే కోస్తాలోని ఐదు జిల్లాల‌ను పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం తూర్పు గోదావ‌రి జిల్లాలో నిర్విరామంగా కొన‌సాగుతుంది. ఈ పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ కు అడుగ‌డుగునా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్న తీరును చూసి అధికార నాయ‌కుల‌ గుండెల్లో శతాబ్ది ఎక్స్ ప్రెస్ ట్రైన్ ప‌రుగులు తీస్తోంది. వ‌చ్చె ఎన్నిక‌ల్లో వైఎస్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అవ్వ‌డం ఖాయం అని మ‌ళ్లీ టీడీపీ ప్ర‌తిప‌క్షంలో రావ‌డం ఖాయం అని భావిస్తున్నార‌ట‌. 
 
అయితే ఇదే విష‌యంపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా స‌ర్వేను నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఈ స‌ర్వే ప్ర‌కారం ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రిగినా కూడా వైసీపీ అధికారంలోకి రావ‌డం ఖాయం అని తేలింది. దీంతో చంద్రబాబు నాయుడు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారని తెలుస్తోంది. 2019లో జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా తాను ప్ర‌తిప‌క్షనేత‌గా ఉండ‌లేన‌ని భావించి రాష్ట్ర బాధ్య‌త‌ల‌ను చంద్ర‌బాబు త‌న కుమారుడు మంత్రి లోకేశ్ కు అప్ప‌గించి ఆయ‌న‌ జాతీయ రాజ‌కీయాల్లోకి వెళ్లేందుకు సిద్ద‌మ‌య్యార‌ని వార్తలు వ‌స్తున్నాయి. 
 
ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు త‌న సొంత జిల్లా కుప్పం నుంచి పోటీ చేస్తూనే, ఎంపీగా పోటీ చేయాల‌ని భావిస్తున్నారట‌. అందుకోసం నెల్లూరు, లేక ఒంగోలులో పోటీ చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక ఇదీ కుద‌ర‌క‌పోతే రాయ‌ల‌సీమ ప‌రిధిలో ఉన్నఏదో ఒక పార్ల‌మెంట్ స్థానంలో పోటీ చేసేందుకు సిద్ద‌మ‌య్యార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక నుంచి టీడీపీ ఓడినా గెలిచినా కూడా జాతీయ రాజ‌కీయాల్లో ఉంటూ రాష్ట్రంలో చ‌క్రం తిప్పాల‌ని చంద్ర‌బాబు చూస్తున్నార‌ట‌. చుద్దాం వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏం జ‌రుగుతుందో.

షేర్ :

Comments

1 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.