బాబు గ్యాస్ తుస్...సైకిలు పంచర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-03 18:50:09

బాబు గ్యాస్ తుస్...సైకిలు పంచర్

రాజకీయాలలో నా అంత అనుభవజ్ఞుడు లేడు, నా అంత విజ‌నరీ ఎవరూ లేరు, టెక్నాలజీని పరిచయం చేసింది నేనే, సింధుకు ప్రేరణ నేనే, కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రధాని పదవిని వదులుకున్నా అని చాలా సార్లు డబ్బా తానే కొట్టుకొనే బాబు... గ్యాస్ ఒక సైకిల్ వ్యవస్థాపకుడి చేతిలో ఉంది...ఆ సైకిల్ వ్యవస్థాపకుడే ములాయం సింగ్... తెలుగుదేశం సైకిల్ కి, ఆ సైకిల్ కి మధ్య సంబంధం ఏంటి అనుకుంటున్నారా అయితే చంద్రబాబు డబ్బా దగ్గరికి వెళ్లాల్సిందే.
 
అయితే మళ్లీ  అదే ప్రస్తావనను ఎమ్మెల్యేల ముందు తీసుకువచ్చారు...అప్పుడు ప్రధాని పదవిని త్యాగం చేశాను అని, ఈసారి ఎమ్మెల్యేలు ఎప్పుడు కొట్టే డబ్బానే కదా ఒకరు ముఖాలు ఒకరు చూసుకున్నారు.. దీంతో వాళ్ళు నమ్మడం లేదని భావించిన   బాబు ఈ సారి ఒక అడుగుముందుకేసి ఎవరెవరు కలిసి ప్రధాని ఆఫర్ ఇచ్చారో వారి పేర్లు బయటపెట్టారు... వాళ్ళు ఈఎంఎస్ నంబూద్రిపాద్మూ, పనార్, బిజూ పట్నాయక్,లాలూ ప్రసాద్ యాదవ్ మరియు ములాయం సింగ్.
 
చంద్రబాబు ప్రధాని ఆఫర్ నిజామా..? కదా..? అనేది తెలియాలంటే వీరిలో ఎవరో ఒకరు నోరు విప్పాలి... అయితే వీరిలో ఈఎంఎస్ నంబూద్రిపాద్మూ, పనార్, బిజూ పట్నాయక్ ఇప్పటికే చనిపోయారు...ఇక లాలూ ప్రసాద్ యాదవ్ జైలులో ఉన్నాడు కాబట్టి నోరు విప్పలేడు, ఇక మిగిలింది ములాయం సింగ్ మాత్రమే...ములాయం సింగ్ స్పందిస్తేనే.. బాబు గ్యాస్ తుస్ మని...సైకిల్ పంచర్ కాకుండా ఉంటుందా లేదా బాబు గ్యాస్ అలానే ఉంటుందా అనేది తెలుస్తుంది...
 
కానీ ములాయం సింగ్ మాత్రం ఎప్పటినుంచో ప్ర‌ధాన‌మంత్రి పదవి కోసం ఎదురుచూస్తున్నారు...ఆ అవకాశాన్ని వదులుకొని బాబుకు ఆఫర్ ఇచ్చారంటే మాత్రం ప్రజలు నమ్మడం లేడు... దీనిపై ములాయం స్పందిస్తారా లేదా మనకెందుకులే అనుకుంటారో తెలీదు.. కానీ సోషల్ మీడియాలో మాత్రంములాయం సింగ్ బాబు గ్యాస్ ని, సైకిల్ ని పంక్చ‌ర్ చేయడం ఖాయం అని జోక్స్ వేసుకుంటున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.