ఫిరాయింపు ఎమ్మెల్యేకి నో టికెట్ ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-15 15:00:18

ఫిరాయింపు ఎమ్మెల్యేకి నో టికెట్ ?

ఏపీలో రాజ‌కీయంగా ఇప్పుడు చ‌ర్చించుకుంటున్న అంశం,కృష్ణా, గుంటూరు జిల్లాలో జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు విశేష స్పంద‌న వ‌చ్చింది.. మ‌రి ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం ఎటువంటి ప్లాన్ అవ‌లంభించ‌బోతోంది.. వైసీపీ క్యాండిడేట్ల పై తెలుగుదేశం ఎవ‌రిని అభ్య‌ర్దులుగా బ‌రిలోకి నిల‌బెట్ట‌నుంది అని చాలా మంది చ‌ర్చించుకుంటున్నారు.ఇక ముఖ్యంగా విజ‌య‌వాడ రాజ‌కీయాల పై అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు. విజ‌య‌వాడ ప‌శ్చిమ‌నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ గురించి అంద‌రికి తెలిసిందే..
 
వైసీపీ నుంచి ఆయ‌న తెలుగుదేశం లోకి  పార్టీ ఫిరాయించారు. అయితే ఒక్క డైలాగ్ ఆయ‌న్ని ప్ర‌పంచానికి మ‌రింత ప‌రిచ‌యం చేసింది... బీకాం ఫిజిక్స్ ఓ సంవ‌త్స‌రం పాటు ట్రెండ్ సెట్‌చేసింది.... ఇక ఎలా ఫేమ‌స్ అయ్యారో ప‌క్క‌న ఉంచితే ఆయ‌న‌కు మంత్రి అయ్యే అవ‌కాశం ఉండేది.. మైనార్టీల‌లో ఆయ‌న‌కు ఛాన్స్ ద‌క్కేది. సీఎం చంద్ర‌బాబు మంత్రిగా ఆయ‌న‌కు అవ‌కాశం  ఇచ్చేవారు. కాని చివ‌రి నిమిషంలో ఈ బీకాం ఫిజిక్స్ వ‌ల్లే ఇవ్వ‌లేదు అని పెద్ద చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయి..
 
అయితే తెలుగుదేశం త‌ర‌పున ఇక్క‌డ వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌లీల్ ఖాన్ నిల‌బ‌డ‌తారా లేదా కొత్త వ్య‌క్తి ఇక్క‌డ నుంచి పోటికి నిలుస్తారా అని కొత్త కొత్త ఆలోచ‌న‌లు వార్త‌లు ప‌శ్చిమ‌నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్ప‌టికే వినిపించాయి.. ఆయ‌న కుమార్తె కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో నిలుచునే అవ‌కాశాలు ఉన్నాయి అని వార్త‌లు వ‌చ్చాయి... అయితే ఎవ‌రికి టికెట్ ఇచ్చినా అక్క‌డ సెగ్మెంట్లో టీడీపీకి మైన‌స్ అంటున్నారు.. వైసీపీ త‌ర‌పున ఉన్న నాయకుడు జ‌లీల్ కు, గట్టి పోటి అని.. అందుకే ఇక్క‌డ కొత్త అభ్య‌ర్దికి అవ‌కాశం ఇస్తారు అని వార్త‌లు వినిపిస్త‌న్నాయి.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.