బాబు కొత్త అస్త్రం ఫెయిల్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu-naidu-narendra-modi
Updated:  2018-02-25 03:09:52

బాబు కొత్త అస్త్రం ఫెయిల్

కేంద్రప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ లో ఏ రాష్ట్రానికి జ‌రుగ‌ని అన్యాయం ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు జ‌రిగింది... దీంతో మిత్ర ప‌క్ష టీడీపీ, బీజేపీ నాయ‌కులు కాస్తా తెర‌పై శ‌త్రువులుగా మారుతున్నారు... అయితే ఇప్ప‌టికే కేంద్ర వైఖ‌రిపై వ్య‌తిరేకంగా రాష్ట్ర‌వ్యాప్తంగా విమ‌ర్శ‌లు వెళ్లువెత్తిస్తున్నారు అధికార టీడీపీ నాయ‌కులు.. గ‌తంలో ఇదే నాయ‌కులు ప్ర‌త్యేక హోదా కంటే ప్ర‌త్యేక ప్యాకేజీ వ‌ల్లే రాష్ట్రానికి అనేక లాభాలు చేకుర‌తాయ‌ని చెప్పారు.. అలా చెప్పిన టీడీపీ నాయ‌కులు ఇప్పుడు మ‌ళ్లీ ముఖం తిప్పి హోదా కోసం పాకులాడుతున్నారు.
 
అయితే ఈ క్ర‌మంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబును ఇరుకున పెట్టేందుకు బీజేపీ ఒక కొత్త వ్య‌వ‌హారానికి  తెర లేపింది... రాష్ట్ర‌ విభ‌జ‌న త‌ర్వాత ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఉమ్మ‌డి ప్రాంతాలైన రాయ‌ల సీమ‌ నాలుగు జిల్లాల‌ను, బాబు పూర్తిగా మ‌రిచిపోయార‌ని, కర్నూలులో హైకోర్ట్ నిర్మిస్తామ‌ని అలాగే ప‌లుహామీలు రాయ‌ల‌సీమ‌కు ఇస్తూ  ఒక డిక్ల‌రేష‌న్ విడుద‌ల‌చేసిన సంగ‌తి తెలిసిందే. 
 
అయితే ఈ డిక్ల‌రేష‌న్ ను త‌ప్పు ప‌ట్టారు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు... తాము అధికారంలోకి వ‌చ్చాక ఏ ప్ర‌భుత్వం చేయ‌లేని అభివృద్ది కార్యక్ర‌మాల‌ను త‌మ ప్ర‌భుత్వం చేసింద‌ని ఆయ‌న అన్నారు... రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ప్ర‌క‌టిస్తామ‌ని చేప్పిన కేంద్ర ప్ర‌భుత్వం... త‌మ‌ను న‌మ్మించి మోసం చేసిందని బాబు వెల్ల‌డించారు... ఈ నేప‌థ్యంలో విభ‌జ‌న చ‌ట్టంలో ప్ర‌క‌టించిన హామీల విష‌యంలో కేంద్రంపై ఒత్తిడి తేవాల‌ని టీడీపీ పార్టీ నేత‌ల‌తో టెలికాన్ఫ‌రెన్స్ లో మాట్లాడారు చంద్ర‌బాబు...
 
ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ అన్యాయం చేసిందని ప్రచారం చేయాల్సిందిగా టీడీపీ నేతలకు ముఖ్యమంత్రి  సూచించారు... ఇదే విషయాన్ని టీడీపీ నాయ‌కులంద‌రూ క‌లిసి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా చంద్ర‌బాబు ఆదేశించినట్లు పార్టీ నేతలు తెలిపారు. అయితే బీజేపీ రాయ‌ల‌సీమ‌కు డిక్ల‌రేష‌న్ ఇచ్చిన వెంట‌నే ఇటువంటి ట్రిక్ బాబు ఉప‌యోగిస్తారు అని అంద‌రూ అనుకున్నారు.. అదే పందాలో బాబు నాయ‌కుల‌కు బీజేపీ పై విమ‌ర్శ‌ల దాడి మొద‌లుపెట్ట‌మ‌ని చెప్ప‌డం తో, ఇది నిజం అని అంటున్నారు..చివ‌ర‌కు ఇలా  మొత్తానికి బాబు అస్త్రం ఫెయిల్ అయింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.