చంద్ర‌బాబు, కోర్టుకు డుమ్మా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu
Updated:  2018-09-21 12:37:35

చంద్ర‌బాబు, కోర్టుకు డుమ్మా

బాబ్లీ ప్రాజెక్ట్ కేసు విచార‌ణ‌లో భాగంగా ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు త‌ర‌పు న్యాయ‌వాదులతో స‌హా ప‌లువురు నేత‌లు మ‌హారాష్ట్ర‌లోని ధ‌ర్మ‌బాద్ కోర్టుకు హాజ‌ర‌య్యారు. చంద్ర‌బాబు త‌ర‌పున న్యాయ‌వాదులు సుబ్బారావు, హ‌న్మంతరావు బృందం కోర్టుకు హాజ‌రు అయింది. వీరు వారెంట్రికాల్ బెయిల్ పిటీష‌న్లు  దాఖ‌లు చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.
 
కరీంన‌గ‌ర్ తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల క‌మ‌లాక‌ర్, చెవ‌ల్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ ర‌త్నం, రాజేంద్ర‌న‌గ‌ర్ తాజా మాజీ ఎమ్మెల్యే ప్ర‌కాష్ గౌడ్ స్వ‌యంగా కోర్టుకు హాజ‌రు అయ్యారు. బాబ్లీ కేసులో చంద్ర‌బాబు నాయుడుతో పాటు 16 మందిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారిచేసింది ధ‌ర్మ‌బాద్ కోర్టు. సెప్టెంబ‌ర్ 21లోగా కోర్టులో హాజ‌రు కావాల‌ని ఆదేసించింది. 
 
దీంతో చంద్ర‌బాబు త‌ర‌పు న్యాయ‌వాదుల‌తో పాటు వారెంట్ల‌ను అందుకున్న ప‌లువురు తెలంగాణ‌ నేత‌లు ధ‌ర్మాబాద్  కోర్టుకు హాజ‌ర‌య్యారు. ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు చెందిన నేత‌లెవ్వ‌రు హాజ‌రుకావ‌టంలేద‌ని తెలుస్తోంది. 2010లో అనుమ‌తి లేకుండా బాబ్లీ ప్రాజెక్ట్ ను సంద‌ర్శించ‌డంతో పాటు అక్క‌డి పోలీసుల‌తో దురుసుగా ప్ర‌వ‌ర్తించినందుకు చంద్ర‌బాబు నాయుడుతో స‌హా ఇత‌ర నాయ‌కుల‌పై అప్ప‌ట్లో కేసులు న‌మోదు అయ్యాయి.   

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.