చంద్ర‌బాబు హెచ్చ‌రికలు జారీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu
Updated:  2018-08-20 12:50:07

చంద్ర‌బాబు హెచ్చ‌రికలు జారీ

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అధికారుల‌కు హెచ్చ‌రిక‌లను జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వ‌ర్షాల‌కు ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డ‌కూడ‌ద‌ని లోత‌ట్టు ప్రాంతాల వారిని అధికారులు అప్ర‌మ‌త్తం చెయ్యాల‌ని చంద్ర‌బాబు ఆదేశించారు. వారికి తాగునీరు, ఆహారం వంటి స‌దుపాయాల‌ను క‌ల్పించాల‌ని ఆయ‌న సూచించారు.
 
వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్న ప్ర‌జ‌ల‌ను స్వ‌చ్చంద సంస్థ‌లు స‌హాయ‌క చ‌ర్య‌లు తీసుకుని స్థానికుల‌తో భాగ‌స్వామ్యం కావాల‌ని  చంద్ర‌బాబు నాయుడు పిలుపునిచ్చారు. వివిధ ప్రాంతాలకు ప్ర‌యాణించే ప్ర‌యాణికుల‌ను వంతెన‌పై ప్ర‌యాణించ‌కుండా అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చంద్ర‌బాబు సూచించారు. అంతేకాదు కృష్ణా జిల్లాలోని అవ‌ని గ‌డ్డలో స్థానికులు పాము కాట్ల‌కు గురి అయిన వారికి త‌క్ష‌ణ‌మే మెరుగైన వైద్యం అందించాల‌ని ఆయ‌న  కోరారు.
 
వర్షం కుంభవృష్టి కురుస్తున్న కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వ్యాధులు ప్రజ‌ల‌కు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఒడిశా తీరాన భువ‌నేశ్వ‌ర్ నైరుతి దిశ‌గా బంగాళాఖాతంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. ఇది ప‌శ్చిమ వాయ‌వ్య దిశ‌గా మ‌రో 24 గంటటు రాష్ట్రంలో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలు ఉన్నాయ‌న‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.