ఎన్టీఆర్ ను మళ్లీ వాడుకోవాల‌ని చూస్తున్న చంద్రబాబు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jr and chandrababu naidu
Updated:  2018-10-23 12:27:51

ఎన్టీఆర్ ను మళ్లీ వాడుకోవాల‌ని చూస్తున్న చంద్రబాబు

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఎప్ప‌టినుంచో ఒక అస్త్రాన్ని ఫాలో అవుతూ వ‌స్తున్నారు. ఆ అస్త్రం పేరు వాడుకుని... వ‌దిలేయి.  ఈ పాల‌సీని చంద్ర‌బాబు నాయుడు త‌న రాజ‌కీయ కెరియ‌ర్ ప్రారంభించిన‌ప్ప‌టి నుంచి అమ‌లు చేస్తూనే ఉన్నార‌ని ఆయ‌న గురించి బాగా తెలిసిన టీడీపీ నేత‌లే అంటున్నారు. ఇక ఇప్పుడు ఎన్నిక‌ల ఏడాదిలోకి అడుగు పెట్టిన చంద్రబాబు ఈ సారి ఎన్నిక‌ల్లో టీడీపీకి ఎదురు దెబ్బ‌త‌ప్ప‌ద‌న్న భావ‌న‌లో ఉన్నారట‌. 
 
ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వ సంస్థ‌ల ద్వారా చంద్ర‌బాబు నిర్వ‌హించుకున్న స‌ర్వేల‌తో పాటు ప్రైవేట్ సంస్థ‌ల్లో కూడా 2019 ఎన్నిక‌ల్లో టీడీపీకి ఘోర ప‌రాజ‌యం త‌ప్ప‌ద‌ని తేల‌డంతో  చంద్ర‌బాబు నాయుడు ఆ న‌ష్టాన్ని వీలైనంత త్వ‌రగా త‌గ్గించుకోవాల‌న్న ఆలోచ‌న‌లో ప‌డ్డార‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో భాగంగా  ప‌దేళ్ల క్రితం వాడుకుని ప‌క్క‌కు పడేసిన  జూనియ‌ర్ ఎన్టీఆర్ ను తిరిగి మ‌ళ్లీ బుట్ట‌లో వేసుకోవాల‌నే వ్యూహంతో చంద్ర‌బాబు నాయుడు ఉన్నార‌ని టీడీపీ వ‌ర్గాలు అంటున్నాయి.  
 
ఈ వ్యూహంలో భాగంగానే జూనియ‌ర్ ఎన్టీఆర్ తాజా సినిమా అరవింద‌స‌మేత వీర‌రాఘ‌వ స‌క్సెస్ మీట్ స‌భ‌కు బాబాయ్ బాల‌కృష్ణ వ‌చ్చి  అభిమానుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచారని అంటున్నారు. 2009 ఎన్నిక‌లు తర్వాత జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన ఏ సినిమా కార్య‌క్ర‌మంలో బాలకృష్ణ క‌నిపించ‌లేదు. అయితే ఇప్పుడు అమాంతంగా ఎన్టీఆర్ న‌టించిన తాజా చిత్రం స‌క్సెస్ మీట్ కు రావ‌డం వెనుక ఆంత‌ర్యం ఏమిట‌ని అంద‌రు భావిస్తున్నారు. అయితే తాజా విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఎన్టీర్ ను తిరిగి ఆక‌ట్టుకోవ‌డానికి, ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్నాయి కాబ‌ట్టి ఆయ‌న‌ను బాల‌కృష్ణ ద్వారా చంద్ర‌బాబు ట్రాప్ చేయాల‌ని చూస్తున్నార‌ని అంటున్నారు. 

షేర్ :

Comments

0 Comment