బాబు సీనియార్టీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-01 14:18:24

బాబు సీనియార్టీ

ఏపీ సీఎం చంద్ర‌బాబు అంటే వెంట‌నే గుర్తువ‌చ్చేది ఆయ‌న చెప్పే హైటెక్ సిటి.. తెలుగువారిని   అమెరికా లాంటి దేశాల‌కు పంపించ‌డానికి తాను ఎంతో కృషిచేసాను, మ‌న వాళ్లకి ఇంగ్లీష్ నేర్పించాను, ఎయిర్ పోర్ట్ క‌ట్టించాను, ప్ర‌ధాన మంత్రిని డిసైడ్ చేస్తాను, ఉప‌రాష్ట్ర‌ప‌తి రాష్ట్ర‌ప‌తిని నేనే డిసైడ్ చేశాను అని ఆయ‌న చిట్టా విప్పుతారు.. ఇక  అన్నింటి కంటే ముఖ్య‌మైంది సీఎం చంద్ర‌బాబు త‌ర‌చూ చెప్పే మాట మీ మారిదిగా కాదు 40 ఏళ్ల అనుభవం ఉంది అలాగే కేంద్రం తాను ఎలా చెబితే అలా న‌డుచుకుంటుంది చక్రం తిప్పాను అంటారు.
 
అస‌లు ఏపీలోనే కాదు దేశంలోనే సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడ్ని అని చెబుతారు... నిజ‌మే అస‌లు ఇప్పుడు ఉన్న యువ‌త‌కు ఎవ‌రికైనా గూగుల్ గైడెన్స్ ఇస్తుంది, సీఎం చంద్ర‌బాబు క‌న్నా ఎవ‌రైనా ప్ర‌పంచ సీనియ‌ర్లు ఉన్నారా అని.. అయితే మిగిలిన వారికి మాత్రం తెలియ‌దు అది మేమిస్తాం... అస‌లు మ‌న దేశంలో చంద్ర‌బాబు కంటే ఎవ‌రైనా సీనియ‌ర్లు ఉన్నారా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం?
 
మ‌న అంద‌రికి తెలుసు క‌మ్యూనిస్ట్ నాయ‌కుల్లో జ్యోతిబ‌సుకు మ‌న దేశంలోనే ఎంతో  పేరు ఉంది.. జ్యోతి బసు-పశ్చిమబంగ రాష్ట్రానికి  – 23 ఏళ్ళు 4 నెలలు సీఎంగా ఉన్నారు ఆయ‌న‌ది ఇప్ప‌టికీ రికార్డు....ఇక ఆయ‌న రికార్డును రెండు రోజుల క్రితం తిర‌గ‌రాసి దేశంలోనే సీనియ‌ర్ సీఎంగా నిలిచారు ఆయ‌న ఎవ‌రంటే?
 
పవన్ కుమార్ చామ్లింగ్… సిక్కిం 23 ఏళ్ళు 4 నెలలు ప‌నిచేశారు !! 28 April 2018 న జ్యోతి బసు రికార్డుని ఈయ‌న దాటేసారు..ఆయ‌న సిక్కిం డెమెక్ర‌టిక్ ఫ్రంట్ ఇక ఈయ‌నే దేశంలో అత్య‌ధిక కాలం సీఎంగా ప‌నిచేసిన వ్య‌క్తి
 
గెగోంగ్ అపాంగ్ అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ మాజీ సీఎం -22 ఏళ్ళు 8 నెలలు సీఎంగా చేశారు.
 
లాల్ తణ్హావాలా-మిజోరాం- 21 ఏళ్ళు 5 నెలలు సీఎంగా చేశారు
 
వీరభద్ర సింగ్-హిమాచల్ ప్రదేశ్-21 ఏళ్ళు
 
మాణిక్ సర్కార్-త్రిపుర-19 ఏళ్ళు 11 నెలలు అవినీతి మ‌ర‌క లేని దేశంలో అత్యంత పేద సీఎం
 
ప్రకాష్ సింగ్ బాదల్-పంజాబ్-18 ఏళ్ళు 11 నెలలు
 
కరుణానిధి-తమిళనాడు-18 ఏళ్ళు 9 నెలలు దేశంలో సీనియ‌ర్ పొలిటిషియ‌న్
 
యస్వంత్ సింగ్ పర్మార్-హిమాచల్ ప్రదేశ్-18 ఏళ్ళు 3 నెలలు
 
నవీన్ పట్నాయక్-ఒడిశా-18 ఏళ్ళు 1 నెల
 
మోహన్లాల్ సుఖాడియా-రాజస్థాన్-17 ఏళ్ళు 6 నెలలు
 
సేనయంగ్బా చుబాతోషి జమీర్-నాగాలాండ్-15 ఏళ్ళు 5 నెలలు
 
షీలా దీక్షిత్-ఢిల్లీ-15 ఏళ్ళు 1 నెల
 
తరుణ్ గొగోయ్-అస్సాం-15 ఏళ్ళు
 
చంద్రబాబు నాయుడు-దాదాపు 13 ఏళ్ళు
 
అదండి విష‌యం  చంద్ర‌బాబు గారు సీనియ‌ర్ అని త‌న‌కంటే దేశంలో ఎవ‌రూ ముందు వ‌రుస‌లో లేరు అని చెబుతారు... అయితే ఈ లిస్ట్ చూస్తే మీకే తెలుస్తుంది.. మ‌రీ ముఖ్యంగా తెలుగుదేశం నేత‌లు కూడా ఇదే చెబుతారు. ఇక‌నైనా ఇలా సీనియ‌ర్ అని చెప్ప‌కండి అంటున్నారు ప్ర‌జ‌లు.. ఇక దేశంలో రాజ‌కీయాల్లో సీనియ‌ర్ అంటే కేవలం త‌మిళ‌నాడు మాజీ సీఎం క‌రుణానిధి అనేది అంద‌రికి తెలిసిందే.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.