నేడే చూడండి బాబు ఇది బీకాంలో ఫిజిక్స్ ను మించిన డైలాగ్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-05 18:32:15

నేడే చూడండి బాబు ఇది బీకాంలో ఫిజిక్స్ ను మించిన డైలాగ్

తెలుగు రాష్ట్రాల విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత 2014లో ఎన్నిక‌లు జ‌రిగితే ఆ ఎన్నిక‌ల్లో  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున పోటీ చేసి గెలిచిన 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అభివృద్ది పేరుతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. 
 
అయితే టీడీపీలోకి ఫిరాయించిన‌ ఎమ్మెల్యేల‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ ఆయ‌న టీడీపీలోకి ఫిరాయించ‌క‌ ముందు కేవ‌లం రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు మాత్ర‌మే తెలుసు, కానీ ఎప్పుడు అయితే బీకాంలో ఫిజిక్స్ స‌బ్జెక్ట్  ఉంద‌ని చెప్పారో ఆ మ‌రుక్ష‌ణం నుంచే జ‌లీల్ ఖాన్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆయ‌న పార్టీలోకి ఫిరాయించిన త‌ర్వాత నుంచి ఇంత వ‌ర‌కు ఆయ‌న డైలాగ్  ను ఏ నాయ‌కుడు మించ‌లేక పోతున్నారు. 
 
అయితే తాజాగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆ డైలాగ్ ని మించార‌ని వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు. ఇలీవ‌లే చంద్ర‌బాబు మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ, తాము కట్టే పన్నులను 15 సంవత్సరాలపాటు వాయిదా వేస్తే అప్పుడు తామే క‌డ‌ప స్టీల్ ఫ్యాక్ట‌రీని నిర్మించుకుంటామ‌ని చెప్పారు. 
 
ఇక ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు.నాలుగు సంవ‌త్స‌రాలు కేంద్రంతో మిత్ర‌ప‌క్షంగా ఉన్న చంద్ర‌బాబు రాష్ట్రానికి ఏం చేశారో మీడియా ద్వారా తెలియ జేయాల‌ని కొంత‌మంది డిమాండ్ చేశారు. 
 
ఇక మ‌రికొంద‌రు అయితే చంద్ర‌బాబు నాయుడు చెప్పిన మాట‌ల‌ను చూస్తుంటే గ‌తంలో ఫిరాయింపు ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ డైలాగ్ గుర్తుకు వ‌స్తోంద‌ని అంటున్నారు. రానున్న రోజుల్లో కేంద్ర నిధుల‌ను అసించ‌కుండా తామే రాజ‌ధానిని, రైల్వే జోన్, దుగిరాజ‌ప‌ట్నం షీ పోర్టును కూడా తామే నిర్మించుకుంటామ‌ని చెప్ప‌డానికి కూడా సిద్ద‌మ‌య్యార‌ని సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మ‌రి టీడీపీ నాయ‌కులు నెటిజ‌న్లు చేసిన కామెంట్స్ పై ఎలా స్పందిస్తారో.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.