చంద్ర‌బాబు విజ్ఞప్తి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu naidu national media
Updated:  2018-04-02 12:25:44

చంద్ర‌బాబు విజ్ఞప్తి

మొత్తానికి దేశ ప్ర‌యోజ‌నాల కోసం ఎంతో క‌ష్ట‌ప‌డుతున్నాను అని తెలియ‌చేస్తున్నారు సీఎం చంద్ర‌బాబు... కేంద్రం త‌మ‌కు ఎంత అన్యాయం చేసిందో తెలియ‌చేయడానికి  బీజేపీ బండారం బ‌య‌ట‌పెడ్డ‌టానికి తెలుగుదేశం అధినేత సీఎం చంద్ర‌బాబు కేంద్రంతో తాడో పేడో తేల్చుకోవ‌డానికి హ‌స్తిన బ‌య‌లుదేరుతున్నారు... ఆయ‌న వెంట క‌లిసి ప‌నిచేసిన పార్టీలు, ఆయ‌న్ని ఆద‌ర్శంగా తీసుకుని రాజ‌కీయాలు చేస్తున్న పార్టీలతో ఆయ‌న చ‌ర్చించ‌నున్నారు..
 
ఏపీకి బీజేపీ చేసిన అన్యాయం పై ఆయ‌న అక్క‌డ చ‌ర్చించ‌నున్నారు... సింగిల్ స్టేచ‌ర్ తో విజ‌యం సాధించామ‌ని విర్ర‌వీగుతున్న బీజేపీ కోర‌లు పీక‌డానికి బాబు రెడీ అయ్యారు అని ఇక్క‌డ తెలుగుదేశం నాయ‌కులు అంటున్నారు.. అయితే ఇటు చంద్ర‌బాబు హ‌స్తిన ప్ర‌యాణం అన‌గానే హస్తిన రాజ‌కీయాలు వేడెక్కాయ‌ట, చంద్ర‌బాబు రాజ‌కీయం గురించి కేంద్రంలో అంద‌రూ చ‌ర్చించుకుంటున్నార‌ట... అయితే ఈ రెండు రోజుల్లో మోదీ సర్కారు ప‌డిపోయినా ఆశ్చ‌ర్యపోక్క‌ర్లేదు అంటున్నారు తెలుగుదేశం నాయ‌కులు.
 
ఇటు కొత్త‌గా అధికారం చేప‌ట్టిన కేంద్ర మంత్రులు కూడా బాబు గారి రాజ‌కీయ ఆలోచ‌న ఎలా ఉండ‌బోతోందో అని ఆలోచ‌న‌లో ప‌డ్డారట. ఇక్క‌డ ఆస్దాన మీడియాలు మాత్రం బాబు మాట‌ల‌ను వ‌ల్లె వేస్తున్నాయి... 40 ఏళ్ల సీనియ‌ర్ రాజకీయాల్లో మ‌న‌కు దొర‌క‌డం అదృష్టం, అని ఏ దేశంలో ఇంత సీనియ‌ర్ నాయ‌కుడు ఉండ‌రు అని అంటున్నాయి. మొత్తానికి హ‌స్తిన వ‌ణుకుతోంది రాజ‌కీయంగా మ‌రో ప్ర‌ళ‌యం, పొలిటిక‌ల్ సునామికి ఈ ఏప్రియ‌ల్ సూచ‌న అంటున్నారు పండితులు...
 
ఇక‌  కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకే రెండురోజుల ఢిల్లీ పర్యటన చేపట్టినట్లు సీఎం  చెప్పారు... ఈ పర్యటన రాజకీయ ప్రయోజనాల కోసం కాదని స్పష్టం చేశారు. ఎంపీలంతా కేంద్రం నుంచి రావాల్సిన రాష్ట్ర ప్రయోజనాలపై పోరాడాలని సూచించారు. దీంతో ఎంపీలు అంద‌రూ ఒకే చెప్పారు.
 
ఈరోజు సాయంత్రం ఢిల్లీ వస్తున్నానని... రేపు, ఎల్లుండి ఢిల్లీ వేదికగా రాష్ట్ర ప్రయోజనాల సాధనపై దృష్టి సారించనున్నట్లు ఎంపీలతో చంద్రబాబు అన్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో వివిధ పార్టీల సభాపక్ష నేతలను కలువనున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై వ్యక్తిగతంగా వివరిస్తానన్నారు. 
 
బీజేపీ మోసం చేసింది ఇక్క‌డ వైసీపీ ఏదో చేస్తోంది అని అంటున్నారు..అయితే జాతి మీడియా మ‌న వైపు  ఉంటే, జాతీయ మీడియాకు ఆయ‌న ఓ విజ్ఞప్తి చేశారు. రాజకీయాలను హైలెట్ చేయవద్దని...రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని హైలెట్ చేయండని జాతీయ మీడియాకు సీఎం తెలియ‌చేశారు మ‌రి చూద్దాం ఈ 48 గంట‌ల రాజ‌కీయం ఎలా జ‌రుగుతుందో ఏ మీడియా  ప్ర‌యారీటి ఇస్తుందో.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.