జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన చంద్ర‌బాబు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-19 03:47:35

జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన చంద్ర‌బాబు

ప్ర‌కాశం జిల్లాలో ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర‌లో ఉన్న వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదివారం కందుకూరు స‌భ‌లో చేసిన ప్ర‌క‌ట‌న అంద‌రికీ తెలుసు. రాజీనామాలు మాత్ర‌మే కాదు...ప‌వ‌న్ చెప్పిన‌ట్లుగా అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్దంగా ఉన్నాం... టీడీపీ అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టినా మ‌ద్ద‌తు ఇస్తామ‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. 
 
ఈ వ్యాఖ్య‌ల‌పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స్పందించారు. ఇబ్బందులు పెట్టేవారు అసూయ‌ప‌డేలా ఏపీని అభివృద్ది చేస్తా... ఒక‌ప్పుడు కేంద్రాన్ని అడుక్కున్నాం.....ఇప్పుడు డిమాండ్ చేస్తున్నామ‌ని బాబు అన్నారు. అనుకున్న స‌మ‌యంలోనే ల‌క్ష్యాల‌ను పూర్తి చేస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. 
 
కొంద‌రు రాజ‌కీయాలు చేస్తున్నారు... ప్ర‌జ‌లు వాటిని అర్ధం చేసుకోవాలి అంటూ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై  విమ‌ర్శ‌లు చేశారు. జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌కు త‌లా, తోక లేదు....పార్ల‌మెంట్ లో సాధించి తెచ్చుకోవాలి....బీజేపీతో టీడీపీ ఎప్పుడు విడిపోతుందా అని వైసీపీ ఎదురుచూస్తోంద‌ని, బీజేపీతో క‌ల‌వాల‌ని వైసీపీ ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని ఆరోపించారు చంద్ర‌బాబు. 
 
ఇప్ప‌టి వ‌ర‌కు  ఏపీకి రావాల్సిన వాటిని పార్ల‌మెంట్లో అడుగుతూనే ఉన్నారు. అయినా కూడా కేంద్ర ప్ర‌భుత్వం ఏపీకి న్యాయం చేయ‌డం లేదనే ఉద్దేశ్యంతోనే వైకాపా రాజీనామాస్త్రం వ‌దిలింది. కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామ‌ని చెబుతున్న టీడీపీ.... జ‌గ‌న్ కోరిన‌ట్లుగా అవిశ్వాసం పెట్టేందుకు ఎందుకు ముందుకు రావ‌డం లేదని కొంద‌రు అంటున్నారు. మరి ఎందుక‌నేది చంద్రబాబే  స‌మాధానం  చెప్పాలి. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.