మ‌రో సంచ‌లనం.....

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-17 16:04:54

మ‌రో సంచ‌లనం.....

ప్ర‌త్యేక హోదా కావాలి 
ప్ర‌త్యేక ప్యాకేజీ బాగుంది
ప్ర‌త్యేక హోదా ఏమైనా సంజీవ‌నా
ప్ర‌త్యేక హోదా అడిగితే జైలుకే
ప్ర‌త్యేక హోదా మాకు ఎందుకు ఇవ్వ‌రు
ప్రత్యేక ప్యాకేజీకి నిధులు ఏమీ ఇవ్వ‌లేదు
ప్ర‌త్యేక హోదాతోనే ఏపీ అభివృద్ది 
ప్ర‌త్యేక‌ హోదాకావాలి
 
ఇన్ని షేడ్లు విక్ర‌మ్ కూడా చూపించి ఉండ‌రు అంటున్నారు వైసీపీ నాయ‌కులు.. ఇక ప్ర‌త్యేక హూదా కోసం అనేక ర‌కాల మాట‌లు మాట్లాడారు.. అలాగే ప్ర‌త్యేక హూదా కోసం పోరాటం అని ఈ నాలుగేళ్లు సైలెంట్ గా ఉన్న తెలుగుదేశం ఇప్ప‌డు నిద్ర‌లేచింది.. వైసీపీ ప్ర‌వేశ‌పెట్టే అవిశ్వాసానికి మ‌ద్ద‌తు అని ప‌లికి చివ‌ర‌కు వారే ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఇక్క‌డ మొత్తానికి సీఎం చంద్ర‌బాబు త‌న వైఖ‌రి చెప్పారు.. ప‌వ‌న్ పై జ‌గ‌న్ పై త‌న అక్క‌సు తెలియ‌చేశారు.. 40 ఏళ్ల రాజ‌కీయ అనుభవం, దిల్లీ వ‌ణుకుద్ది, ఎన్డీఆర్ పార్టీ, లోకేష్ మంత్రి, మావాళ్లు నిప్పులు, వారంద‌రికంటే నేను సీనియ‌ర్ అంటూ త‌న ప్ర‌సంగాన్ని రోజూవారీ కోటాలో ఇచ్చారు.
 
ఇక 29 సార్లు ప్ర‌ధానిని సీఎం క‌లిశార‌ట, ఈ నాలుగు సంవ‌త్స‌రాల్లో ఇది తెలుగుదేశం నాయ‌కులు ఎప్పుడూ చెప్పేమాట.. అలాగే ఓ బీజేపీ నేత కూడా అన్నాడు?  మీరు ప్ర‌ధానిని క‌లిసి ఈ నాలుగు సంవ‌త్స‌రాల్లో ఎన్ని సార్లు ఏపీకి సాయం కావాలి అని అడిగారు ?  ప్ర‌త్యేక హూదా కావాలి అని కోరారు అని ప్ర‌శ్నించాడు.. దాని ఆంత‌ర్యం ఏదో ఉంది అని తెలుస్తోంది.. ఇక రాష్ట్రంలో అసెంబ్లీ సీట్ల పెంపు చేయ‌లేదు అని సీఎం చంద్ర‌బాబు మ‌ద‌న‌ప‌డ్డారు.. ఒక్క‌పైసా కూడా ఖ‌ర్చులేని ప‌ని బీజేపీ చేయ‌లేదు అని అన్నారు.
 
అది తెలుగుదేశం - బాబు స‌ర్కారు నిజం ఒప్పుకుంది.. మొత్తానికి ఏపీకి ప్ర‌త్యేక హూదా ఇవ్వ‌క‌పోయినా ప‌ర్వాలేదా? నిధులు రాలేదు అని ప్ర‌శ్నించ‌డం లేదు..? రాజ‌ధాని నిర్మాణానికి నిధులు అడ‌గలేదు?  విద్యాల‌యాల గురించి అడ‌గ‌లేదు..? అని తేలిపోయింది. ఇక్క‌డ ఫిరాయింపు నాయ‌కులకు - వార‌సుల‌కు సీట్ల కోసం ఇటువంటి ప్లాన్ వేశారా..
 
అస‌లు ఏపీకి ఎటువంటి సాయం చేసే ప‌రిస్ధితుల్లో కేంద్రం లేదు కాని సీట్లు పెర‌గ‌లేదు అని అడ‌గడం ఏమీటి.. ఎవ‌రూ ఎలా పోయినా అంతేనా రాజ‌కీయాలు సీట్ల గోల ఎప్పుడూ మార‌దా అని ప్ర‌జ‌లు కూడా మండిప‌డుతున్నారు... ఇటు వైసీపీ అటు జ‌న‌సేన, కాంగ్రెస్ అడ‌గ‌ని సీట్ల పెంపు తెలుగుదేశం ఎందుకు అడుగుతోంది. తెలుగుదేశానికి అంత అత్యుత్సాహం ఎందుకు.. ఫిరాయింపుకు సీట్లు కేటాయించ‌డానికి ఈ ఆలోచ‌న, అంతేనా అని ప్ర‌శ్నిస్తున్నారు ప్ర‌జ‌లు. మిగిలిన ప్ర‌తిప‌క్ష పార్టీలు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.