రమణ దీక్షితులు పూజగదిలో రాజశేఖ రెడ్డి ఫోటో

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-23 15:06:33

రమణ దీక్షితులు పూజగదిలో రాజశేఖ రెడ్డి ఫోటో

ఎవరైనా సరే వాళ్లకు నచ్చిన సెలబ్రిటీస్ తో ఫోటోలు దిగితే, ఆ ఫోటోని ఫ్రేమ్ కట్టించుకొని ఇంట్లో పెట్టుకుంటారు. ఎవరి వల్ల అయినా లబ్ది పొందితే వాళ్ళ ఫోటోలను కూడా ఇంట్లో పెట్టుకుంటారు...వాళ్ళు చేసిన సహాయానికి కృతజ్ఞతగా ఇలా పెట్టుకుంటారు...అందుకే పూజారులకు ఎంతో మేలు చేసిన రాజశేఖర్ రెడ్డిని ఎంతో మంది పూజారులు కూడా గుర్తుపెట్టుకుంటారు...ఆ కృతజ్ఞతకు గుర్తుగా కొందరు ఇంట్లో రాజశేఖర్ రెడ్డి ఫోటోలు కూడా పెట్టుకున్నారు...
 
అలాగే రమణ దీక్షితులు కూడా రాజశేఖర్ రెడ్డి ఫోటోను ఇంట్లో పెట్టుకున్నారు...దానిని కూడా రాజకీయం చేయాలనీ చూస్తున్నారు చంద్రబాబు.. టీటీడీలో జరుగుతున్న అవకతవకలపై తిరుమల ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆరోపణలు చేశారు...ఆ అవకతవకలపై సమాధానం చెప్పలేక రమణ దీక్షితులపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తున్నారు. అయినా రమణ దీక్షితులు న్యాయం జరిగే వరకు పోరాడుతా అని చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో నిరాహార దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నారని కూడా వార్తలు వచ్చాయి...
 
అందుకే ఎలాగైనా రమణ దీక్షితులు వ్యక్తిత్వాన్ని కించపరచడానికి టీడీపీ నాయకులు ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు ప్రతిపక్ష నేతలు...ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి...కేవలం ఫోటోను చూపిస్తూ ఆరోపణలు చేయడం మంచికాదని విమర్శిస్తున్నారు ప్రతిపక్ష నేతలు... చివరకు ఆయన తమిళ బ్రాహ్మణుడు అని ప్రచారం చేయడం మొదలుపెట్టారు.
 
రమణ దీక్షితులు చేసిన ఆరోపణులకు, నిజాయతీగా సమాధానం చెప్పకుండా, ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడడం తగదని అంటున్నారు మేధావులు. టీటీడీలో ఏ తప్పు జరగకపోతే విచారణకు ఎందుకు ఆదేశించలేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు...
 
ఇక్కడ చంద్రబాబు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది...మరణించిన వ్యక్తి ఫోటోలను ఇంట్లో పెట్టుకున్నారంటే అది ఆయన గొప్పత‌నం...ఎవరైనా ఎంతో మేలు చేసి ఉంటే తప్ప అలా ఎవరు పెట్టుకోరు, పూజారులకు రాజశేఖర్ రెడ్డి మేలును గుర్తుపెట్టుకొని అర్చకుడు, రాజశేఖర్ రెడ్డి ఫోటోను ఇంట్లో పెట్టుకున్నందుకు గర్వపడాలి కానీ ఇలా కుళ్ళుకోవడం మంచిది కాదు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.