జ‌గ‌న్ మ‌రో రికార్ట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-11 15:25:12

జ‌గ‌న్ మ‌రో రికార్ట్

ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర ఈ రోజు మ‌రో రికార్డును అదిగ‌మించింది. ఈ సంక‌ల్ప‌యాత్ర‌లో టీడీపీ నాయ‌కులు చేస్తున్న అవినీతి అరాచ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ వైసీపీ అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్. 
 
అంతే కాదు టీడీపీ ప‌రిపాల‌న‌లో జ‌రిగిన అన్యాయాల‌ను పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డిని క‌లుసుకుని ఆయ‌న‌కు వివ‌రించేందుకు జ‌నాలు తండోప తండాలుగు త‌ర‌లి వ‌స్తున్నారు. ఇక వారి ఫిర్యాదుల‌ను వింటున్న జ‌గ‌న్ ప్ర‌తీ ఒక్క‌రికి చోదోడు వాదోడుగా అండ‌గా నిలుస్తానని హామీ ఇస్తున్నారు .
 
అంతే కాదు 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి వ‌ప్తే రాజ‌న్న పాల‌న మ‌ళ్లీ తీసుకువ‌స్తాన‌ని, టీడీపీ ప‌రిపాల‌న‌లో ప్ర‌జ‌ల‌కు అంద‌వ‌ల‌సిన ఆరోగ్య శ్రీ ప‌థకం స‌రిగ్గా అంద‌డం లేద‌ని దానిని మళ్లీ తిరిగి తీసుకువాస్తాన‌ని జ‌గ‌న్ హామీ ఇస్తున్నారు.అలాగే న‌వ‌ర‌త్నాల‌ను కూడా ప్ర‌జ‌ల‌కు వివ‌రంగా వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్.
 
ఇక ఈ  సంక‌ల్ప‌యాత్ర ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలోని నిర్విరామంగా కొన‌సాగుతోంది. ఈ పాద‌యాత్ర‌లో భాగంగా ఈ రోజు జ‌గ‌న్ నందమూరు ‍క్రాస్‌ రోడ్డు చేరుకున్నారు. దీంతో జ‌గ‌న్ 2300 కిలో మీట‌ర్ల‌ను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ పార్టీ జెండా ఆవిష్కరించి ఈ మైలురాయికి గుర్తుగా ఒక మొక్కను నాటారు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఇక‌ మ‌రో వైపు పాద‌యాత్ర‌కు వ‌స్తున్న జ‌నాల‌ను చూసి తెలుగు త‌మ్ముళ్లు బెంబేలెత్తిపోతున్నారు.
 
పాదయాత్ర ఘనతలు 
2200 పశ్చిమ గోదావరి జిల్లా నరసాపుం నియోజకవర్గంలో రైల్వేగేటు దగ్గర (మే 30,2018)
2100 పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని పిప్పర(మే 22,2018)
2000 పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గంలోని వెంకటాపురం (మే 14,2018)
1900- కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం తాడంకి (ఏప్రిల్‌ 29, 2018)
1800- కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం గణపవరం (ఏప్రిల్‌ 18, 2018)
1700- గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం సుల్తానాబాద్‌ (ఏప్రిల్‌ 7,2018)
1600-గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని పలుదేవర్లపాడు (మార్చి 27, 2018)
1500- గుంటూరు జిల్లా పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలోని ములుకుదూరు(మార్చి 14, 2018)
1400 - ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం  నాగులపాడు (మార్చి 5, 2018)
1300 - ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలోని నందనమారెళ్ల (ఫిబ్రవరి 25, 2018)
1200 - ప్ర‌కాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం, రామ‌కృష్ణాపురం (ఫిబ్రవరి 16, 2018)
1100 - నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గం, క‌లిగిరి (ఫిబ్రవరి 7, 2018)
1000 - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురంలో పైలాన్‌ ఆవిష్కరణ (జనవరి 29, 2018)
900 - చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం చెర్లోపల్లి హరిజనవాడ (జనవరి 21, 2018)
800 - చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం నల్లవెంగనపల్లి (జనవరి 11, 2018)
400 - అనంతపురం జిల్లా, శింగనమల నియోజకవర్గం గుమ్మేపల్లి (డిసెంబర్‌ 7,2017)
700 - చిత్తూరు జిల్లా, పీలేరు నియోజకవర్గం చింతపర్తి శివారు (జనవరి 2, 2018)
600 - అనంతపురం జిల్లా, కదిరి నియోజకవర్గం కటారుపల్లి క్రాస్‌ రోడ్స్‌ (డిసెంబర్ ‌24, 2017)
500 - అనంతపురం జిల్లా, ధర్మవరం నియోజకవర్గం గొట్లూరు (డిసెంబర్‌ 16, 2017)
300 - కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు నియోజకవర్గం కారుమంచి (నవంబర్‌ 29, 2017)
200 - కర్నూలు జిల్లా, డోన్‌ నియోజకవర్గం ముద్దవరం (నవంబర్‌ 22, 2017)
100 - క‌ర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రి సమీపం (నవంబర్‌ 14, 2017)
0 - వైఎస్‌ఆర్‌ జిల్లా, పులివెందుల నియోజకవర్గం ఇడుపులపాయ (నవంబర్‌ 6, 2017) 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.