వైసీపీ సక్సెస్....

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-21 11:17:42

వైసీపీ సక్సెస్....

ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు యూట‌ర్న్ తీసుకున్నారు. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అనే చెప్పాలి. కేంద్రం ఏపీపై ప్ర‌ద‌ర్శిస్తున్న స‌వ‌తి త‌ల్లి ప్రేమ‌ను  చంద్ర‌బాబుకు బోద‌ప‌డేట్లు చేశారు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.
 
ఏపికి ప్ర‌త్యేక హోదా ఐదేళ్లు స‌రిపోదు 15 యేళ్లు కావాలంటూ పాట పాడిన చంద్ర‌బాబు... తీరా  ఎన్నిక‌ల తర్వాత ప్ర‌త్యేక ప్యాకేజీకి జై కొట్టారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏపీకి ప్ర‌త్యేక హోదా వ‌స్తేనే ఏపీ అభివృద్ది అవుతుందంటూ మొద‌టి నుండి  పోరాడుతూనే ఉంది. 
 
ప్యాకేజీతో న్యాయం జ‌రుగుతుందనుకున్న టీడీపీకి  ఊహించ‌ని  షాక్ త‌గిలింది. ఇప్ప‌టివ‌ర‌కు కేంద్రం ఇచ్చిన నిధుల‌కు లెక్క‌లు చెప్పాలంటూ  కొత్త మెలిక పెట్ట‌డ‌మే కాకుండా, బడ్జెట్ స‌మావేశాల్లో  విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాల‌ను ప‌క్క‌కు పెట్టేసింది కేంద్ర ప్ర‌భుత్వం. 
 
దీంతో చంద్రబాబు మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చారు.గ‌త కొన్ని రోజుల క్రితం ఈశాన్య రాష్ట్రాల‌కు కేంద్ర‌ప్ర‌భుత్వం ప్ర‌త్యేక హోదా గ‌డువును పొడిగించింది. దీంతో హోదాను ఇవ్వ‌లేము, అందుకు త‌గిన‌ట్లుగానే నిధులు, స‌దుపాయాలు క‌ల్పిస్తామ‌ని చెప్ప‌డంచేత‌నే  ప్యాకేజీకి ఒప్పుకున్నామ‌ని చెప్పిన చంద్ర‌బాబు.... ఇప్పుడు మిగ‌తా రాష్ట్రాల‌కు హోదా ఎలా పొడిగిస్తారంటూ  చంద్ర‌బాబు మండిప‌డుతున్నారు.
 
ఇత‌ర రాష్ట్రాల‌కు హోదా ఇస్తున్న‌పుడు మాకు కూడా ఇవ్వాల్సిందేనంటూ సీఎం చంద్ర‌బాబు యూట‌ర్న్ తీసుకున్నారు. మ‌రోవైపు ప్ర‌త్యేక హోదా కోసం రాజీనామాల‌తో పాటు కేంద్ర ప్ర‌భుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని ప్ర‌క‌టించిన వైయ‌స్ జ‌గ‌న్.....హోదా కోసం టీడీపీ అవిశ్వాసం పెట్టినా మ‌ద్ద‌తు ఇస్తామంటూ తేల్చిపారేశారు. 
 
ఇక ప్యాకేజీ విష‌యంలో మొద‌టి నుండి ఒకే పందాను కొన‌సాగిస్తున్న వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ, చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌తో స‌క్సెస్ అయింద‌నే చెప్పాలి. మ‌రి  ఏపీకి రావాల్సిన హ‌క్కుల‌పై కేంద్రంతో క‌య్యానికి కాలు దువ్వుతున్న రెండుపార్టీలు ఇలాగే ముందుగు సాగుతాయా.....? మ‌ధ్య‌లో చేతులెత్తేస్తాయా.....? చూద్దాం.....!!

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.