భ్ర‌మ‌రావ‌తి క‌థ‌లు ఎడిటింగ్ ఎక్కువ -నిర్మాణాలు త‌క్కువ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-21 15:42:06

భ్ర‌మ‌రావ‌తి క‌థ‌లు ఎడిటింగ్ ఎక్కువ -నిర్మాణాలు త‌క్కువ

మొత్తానికి చంద‌మామ క‌థ‌లు విక్ర‌మార్కుడి క‌థ‌లు మ‌న‌కు తెలుసు కాని, ఇప్పుడు ఏపీలో ప్ర‌జలంద‌రికి తెలిసింది భ్ర‌మ‌రావ‌తి క‌థ‌లు.. మాములుగా క‌థ అంటే నాలుగు అధ్యాయాలు ప‌ర్వాలు పుంకాలు గా ఉంటుంది. అయితే ఇది మ‌హాభార‌త ఇతిహాస వృత్యాంతాలుగా క‌నిపిస్తోంది. కొత్త కొత్త డిజైన్లు హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్స్ తో భ్ర‌మ‌రావ‌తి నిర్మితం అవుతోంది.ఇందులో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడి హ‌స్తం ఉంటుంది అని భావించినా ఆయ‌న దూర దృష్టితో వెన‌క‌డుగువేశాడు.
 
ఇప్పుడు ఈ భ్ర‌మ‌రావ‌తి పార్ట్ 18 న‌డుస్తోంది.. అంటే మ‌హాభార‌త ప‌ర్వాల‌ సంఖ్య ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింది.. ఇప్ప‌టికే 18 డిజైన్లు చూశారు మ‌రి..అమెరికా, సింగ‌పూర్ థాయ్ లాండ్, మ‌లేషియా ఇలా ప‌లు దేశాల రాజ‌ధానులు ఇన్న‌ర్ సిటీస్ ఇక్క‌డ నిర్మిత మ‌వుతాయ‌ని ఈఫిల్ ట‌వ‌ర్ః రేంజ్ ఐటీ ఆర్దిక ట‌వ‌ర్లు అమ‌రావ‌తిలో నిల‌బ‌డ‌తాయ‌ని అంద‌రూ ఊహిస్తున్నారు...2050 క‌ల్లా అమ‌రావ‌తిని ప్ర‌పంచ న‌లుమూల‌ల‌కు ఈజీగా క‌నెక్టివీటి ఉంటుంది.. ప్ర‌పంచంలో స్మార్ట్ సిటీ అవుతుంది అని ఇటు అధికార పార్టీ చెబుతోంది.
 
అయితే ఇంకా న‌మూనాలు, గ్రాఫిక్స్, ఎడిటింగ్, విజువ‌ల్ ఎఫెక్ట్ ద‌గ్గ‌రే ఈ ప‌నులు ఉండేస‌రికి.. ఇక కూలీలెప్పుడు వ‌స్తారు..? సిమెంట్ క‌లిపేదేప్పుడు రంగులేసేదెప్పుడు అన్న‌ట్లు త‌యా,రైంది ఇక్క‌డ వ్య‌వ‌హారం. మ‌హాభార‌తంలో ఆదిప‌ర్వం స్టార్టింగ్ అయితే, చివ‌రి ప‌ర్వం హ‌రివంశ ప‌ర్వ‌ము.. కాని ఇక్క‌డ మాత్రం భ్ర‌మ‌రావ‌తికి ఆది లేదు చివ‌రి ప‌ర్వం లేదు... ప్ర‌తీ ఏడాది సీతారాముల క‌ల్యాణం చూత‌ము రారండి అనేలా భ్ర‌మ‌రావ‌తి సినిమాలు చిత్రాలు క‌థ‌లు డిజైన్లు చూత‌ము రారండి అనేలా ఉన్నాయి..ఈ  ప్ర‌గ‌ల్బాలు మ‌రి ఎప్పుడు ఈ భ్ర‌మ‌రావ‌తి నిర్మాణం అవుతుందో చూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.