బాబు న‌యా ప్లాన్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-20 17:47:03

బాబు న‌యా ప్లాన్

సీఎం చంద్ర‌బాబు రాజ‌కీయంగా ప్ర‌యోజనం ఆశించ‌కుండా ఏ వ‌ర్క్ నాట్ డూయింగ్ అంటారు చాలా మంది... ముందు చెప్పుకున్న విధంగా బాబే కాదు ఏపార్టీ అయినా అంతే రాజ‌కీయంగా ఏదో ఒక‌టి ఆశించి రాజ‌కీయాలు చేస్తూ ఉంటారు. ఇక వ‌చ్చే ఎన్నికల్లో మ‌ళ్లీ విజ‌యం సాధించాలి అంటే ప్ర‌త్యేక హూదా ఏపీకి సాధించి,  బీజేపీని  కింద‌కి ప‌డేసి వైసీపీని మూల‌న పెడ‌దాము అని అనుకున్నారు.. అలాగే  రెండోసారి విజ‌యం సాధించాలి అని అనుకున్నారు బాబు...అయితే అది ఏమాత్రం జ‌రిగేలా క‌నిపించ‌డం లేదు అన్ని మ‌నం త‌ల‌చిన‌వి జ‌రుగ‌వు అలాగే ఇది జ‌రుగుతోంది.
 
జ‌గ‌న్ దీక్ష చేసినా తిట్టారు, కాంగ్రెస్ చేస్తే మీరే విభ‌జించారు అని అనేక కామెంట్లు చేశారు తెలుగుదేశం నాయ‌కులు.. అయితే చంద్ర‌బాబు రాజ‌కీయం ఉద్దేశం ఏమిటి అనేది రాజ‌కీయాల్లో ఉన్నవారు ఇట్టే గ్ర‌హిస్తారు... అయితే ఇప్పుడు ఈ యూట‌ర్న్ లు చూసి జ‌నం కూడా గ్ర‌హిస్తున్నారు. ఇక్క‌డ చంద్ర‌బాబు రాజ‌కీయం కాస్త గ్ర‌హిస్తే కేంద్రం పై పోరాటం అని ప్లకార్డులు ప‌ట్టుకుని నిర‌స‌న‌లు తెలియ‌చేశారు బీజేపీ పై... ప్ర‌త్యేకహూదా కోసం వైసీపీ కేంద్రంపై అవిశ్వాసం అనేస‌రికి ఏకంగా ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి జ‌గ‌న్ కు క్రెడిట్ రాకూడ‌దు అని, త‌మ పార్టీ త‌ర‌పున కేంద్రం పై అవిశ్వాసం ప్ర‌వేశ‌పెట్టారు అది స‌భ‌లో చ‌ర్చ‌కు రాలేదు.
 
ఇక సైకిల్ ర్యాలీలు చెవులో పువ్వులు పెట్టుకుని నిర‌స‌న, కొర‌డాల‌తో కొట్టుకోవ‌డం న‌ల్ల బ్యాడ్జీలు  ధ‌రించ‌డం అనేక ర‌కాలుగా వీరు ప్ర‌త్యేక హూదా పోరాటం చేస్తున్నాము అని చెబుతున్నారు... ఇలా చేస్తే ఎటువంటి ప్ర‌యోజ‌న‌మో ప్ర‌జ‌ల‌కు ఇట్టే తెలుసు. ఇక చంద్ర‌బాబు ఆరాటం పోరాటం ఎలా ఉన్నా వచ్చే ఏడాది మ‌ళ్లీ అధికారంలోకి రావాలి. అందుకే ప్ర‌త్యేక హూదా పోరాటం మ‌రింత ఉధృతం చేయాలి అని భావించారు..పెద్ద పోరాట ప్రణాళికనే ప్రకటించారు. 
 
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ భారీ బహిరంగ సభలు నిర్వహించాలని, 20రోజుల పాటు సైకిల్ యాత్రలు నిర్వహించాలని స‌రికొత్త ప్లాన్ .. అందులో భాగంగానే నేడు పుట్టిన రోజున కూడా దీక్ష అంటూ ప్ర‌త్యేక హూదా డిమాండ్ కు కొత్త‌గా తీసుకున్నారు. అయితే బీజేపీ ప‌రువు తీస్తారు అని అనుకోవ‌డానికి లేదు అనేది ఇక్క‌డ కొత్త వాద‌న‌... ఈ 20 రోజులు చంద్ర‌బాబు స‌ర్కారు ఏపీకి చేసిన‌టువంటి ప‌థ‌కాలు ఫ‌లితాలు తెలుగుదేశం సాధించిన విజ‌యాలు బ్యాండ్ కొట్ట‌డానికి అని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.
 
అభివృద్ది గురించి ప్ర‌జ‌లు తెలియ‌చేయ‌నున్నార‌ట‌.. స‌ర్కారు సాధించిన విజ‌యాలు సొంత డ‌బ్బాకు మాత్ర‌మే ఈ స‌భ‌లు స‌మావేశాలు యాత్ర‌లు  అని  అప్పుడే విమ‌ర్శ‌లు వైర‌ల్ అవుతున్నాయి... ఇక సైకిల్ పార్టీ యాత్ర‌లతో  పార్టీ కోసం  కేడ‌ర్ క‌ష్ట‌ప‌డాల‌ని బాబు ఆలోచ‌న‌గా తెలుస్తోంది. ఇలా చేస్తే ప్ర‌త్యేక హూదా ఎప్పుడు వ‌స్తుంది అస‌లు రాష్ట్రంలో ప్ర‌జ‌లే ఇవి ప‌ట్టించుకోవ‌డం లేదు ఇక కేంద్రం ఏం ప‌ట్టించుకుంటుంది అని అంటున్నార ప్ర‌జ‌లు. ఇలా కేంద్రంపై ఒత్తిడి పెంచాలి అని అనుకోవ‌డం ఏమిటో ఓసారి ఆలోచించాల‌ని జ‌నాలు కూడా చెబుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.