బాబు మ‌రో కొత్త ప్లాన్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-21 18:14:46

బాబు మ‌రో కొత్త ప్లాన్

నా అంత అనుభ‌వం ఎవ‌రికి లేదు ప‌రిపాల‌న‌లో నా అంత సీనియ‌ర్ ఎవ‌రు లేరు అని 2014 ఎన్నిక‌ల ప్ర‌చారంలో సీఎం చంద్ర‌బాబు చెప్పారు... ఇప్పుడు అదే విష‌యం బెబుతూ దేశంలో నా అంత సీనియ‌ర్ ఎవ‌రూ లేరు అంటున్నారు.
 
అయితే ఆ సీనియార్టీ గురించి ప‌క్క‌న పెడితే, తెలుగుదేశం అధినేత సీఎం చంద్ర‌బాబు నా ఇటుక - నా అమరావతి పిలుపు ఇచ్చారు మొద‌ట్లో దినికి ప్ర‌జ‌ల నుంచి స్పంద‌న బాగానే వ‌చ్చింది... శంకుస్థాపన సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పిలుపుకు ప్ర‌జ‌లు ముందుకు వ‌చ్చారు..  ఇటుకలు దానం చేయటానికి కొందరు ముందుకు వచ్చారు. ఒక్కో ఇటుక ధర రూ.10లు నిర్ణయించటంతో ఆమేరకు నిధులను సిఆర్‌డిఎ కు బదలాయించారు. అలా డిజిట‌ల్ స‌ర్టిఫికెట్లు పంపారు స‌ర్కారు ద్వారా.
 
అయితే అమ‌రావ‌తి రాజ‌ధాని శంకుస్ధాప‌న‌కు 400 కోట్లు ఖ‌ర్చు పెట్టిన ఈ స‌ర్కారు అస‌లు అక్క‌డ 4 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ ప‌నిని కూడా చేయ‌లేక‌పోయింది... ఇప్ప‌టికి ఒక్క శాశ్వ‌త భ‌వనం క‌ట్ట‌లేదు, క‌ట్టిన స‌చివాల‌యం అసెంబ్లీ కూడా తాత్కాలిక‌మే దానికి  కూడా 1500 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టారు. అయితే తెలుగుదేశం అధినేత ఇటీవల అమ‌రావ‌తి ప్ర‌జ‌ల‌కు ఓ పిలుపు ఇచ్చారు.. ఏపీకి తానే ఓ దిశానిర్దేశం అని మీరు న‌మ్మారు? మీ న‌మ్మ‌కాన్ని ఒమ్ము చేయ‌ను అని అన్నారు. ఇక ప్ర‌జ‌లు నిధులు ఇవ్వండి ఆ నిధుల‌కు బాండ్లు జారీ చేస్తాం దానికి వ‌డ్డీ ఇస్తాం అనేలా చెబుతున్నారు ఆ నిధుల‌తో రాజ‌ధాని క‌డ‌తాం అని స్టేట్ మెంట్ ఇచ్చారు.
 
అయితే దీనిపై ప్రజలనుంచి ఎంత మొత్తం అప్పులు తీసుకోదలచుకున్నారు.. ఎంతవరకు వారికి    ఎఫ్ఆర్ బీఎం అనుమతి దొరుకుతుంది వంటి విషయాలేమీ ఇప్పటిదాకా క్లారిటీ లేదు. అయినా ప్రజలు సిద్ధమైపోయారు అంటూ.. చంద్రబాబు అప్పుడే చెప్పేస్తున్నారు. ప్రజలు ఎగబడి నిధులిస్తున్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయి... ఇక మీడియాల ద్వారా ఇదే విష‌యాన్ని తెలియ‌చేస్తున్నారు...జ‌నాలు కూడా అమెరికా బ‌డ్జెట్ ఎంత ఉందో అంత నిధులు అమ‌రావ‌త‌కి వ‌స్తున్నాయి అనేలా న‌మ్మేలా ఆ మీడియా ద్వారా ప‌దే ప‌దే చెబుతున్నారు.
 
గ‌తంలో ఈ మీడియా మేనేజ్ మెంట్ విష‌యం తెలిసిందే... దివంగ‌త నేత మాజీ సీఎం ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన స‌మ‌యంలో అంతా అయిపోయింది, ఆ కోట‌రీ నుంచి అంతా ఇక్క‌డ‌కి వ‌చ్చేశారు, వైస్రాయ్ హూటల్ ఎమ్మెల్యేల‌తో నిండిపోయింది అంద‌రూ వ‌చ్చేసారు అని మీడియా ద్వారా కొత్త ఎత్తుగ‌డ వేశారు... ఇప్పుడు కూడా సేమ్ అలాగే అంతా అయిపోయింది బ్యాంకులు కూడా త‌మ వ‌ల్ల కాదు అంత‌ న‌గ‌దు అమ‌రావ‌తికి వ‌స్తే అనేట‌ట్లు స‌మాధానం ఇస్తున్న‌ట్లు ఆస్ధాన మీడియాలు వ‌ల్లె వేస్తున్నాయి.. నిజంగా వీరికి ఇంత చిత్త శుద్ది ఉంటే ఓ రెండు నెల‌లు ఎమ్మెల్యేలు జీతాలు వ‌దిలెయ్య‌వ‌చ్చు క‌దా అని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.