చంద్రబాబు ఆఫ‌ర్ ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-28 18:11:01

చంద్రబాబు ఆఫ‌ర్ ?

మొత్తానికి ఆళ్ల‌గ‌డ్డ పంచాయ‌తీకి పుల్ స్టాప్ ప‌డింది అనే చెప్పాలి... మంత్రి భూమా అఖిలప్రియతో సర్దుకుపోవాలని ఏవీ సుబ్బారెడ్డికి సీఎం చంద్రబాబు సూచించారు..... ఇక ఆళ్ల‌గ‌డ్డ రాజ‌కీయాల్లో జోక్యం చేసుకోవ‌ద్ద‌ని తాను బిజీగా రాజ‌కీయాల్లో ఉంటే మీ పోరు ఏమిటి అని ఇద్ద‌రిని ప్ర‌శ్నించారు చంద్ర‌బాబు.. రాజ‌కీయంగా క‌ర్నూలులో పార్టీని మ‌రింత పైకి తీసుకురావాలి అని మంత్రుల‌తో అక్క‌డ భేటీలు స‌మావేశాలు కేడ‌ర్ ను నిల‌బెడుతుంటే మీ వ‌ర్గ పోరు ఏమిటి అని ప్ర‌శ్నించారట‌.
 
ఇక మ‌రోసారి త‌న వ‌ద్ద‌కు పంచాయ‌తీకి రాకూడ‌ద‌ని తెలియ‌చేశార‌ట సీఎం....  అలాగే పంచాయ‌తీల‌కు అమ‌రావ‌తికి వ‌చ్చేలా మ‌రోసారి వివాదాల‌కు క‌య్యాల‌కు ఎవ‌రు కాలుదువ్వినా ప‌రిణామాలు చాలా దారుణంగా ఉంటాయ‌ని తెలిపార‌ట‌. ఇక మంత్రి అఖిల‌కు కేడ‌ర్ తో క‌లిసి ముందుకు వెళ్లాలి సీనియ‌ర్ల‌ను  ప‌క్క‌న పెట్టే దోర‌ణి వీడాలి అని చెప్పార‌ట‌. ఆళ్ల‌గ‌డ్డ‌లో ఏవీ ని త‌ల‌దూర్చ‌వ‌ద్ద‌ని, అక్క‌డ రాజ‌కీయాలు  అఖిల చూసుకుంటుంది అని తెలిపార‌ట సీఎం చంద్ర‌బాబు.
 
ఇక ప‌ద‌వి లేక ఇటువంటి వివాదాలు వ‌స్తున్నాయి, ఇక నామినేటెడ్ ప‌ద‌వి ఇస్తాను అని ఏవీకి హామీ ఇచ్చార‌ట సీఎం చంద్ర‌బాబు... అక్క‌డ మంత్రిగా అఖిల విష‌యంలో వ‌ర్గ విభేదాలు ఉండ‌కూద‌ని, ఇలాంటి దాడుల‌కు ఎవ‌రు పాల్ప‌డినా మ‌రోసారి బాగోదు అని సీఎం సూచించార‌ట‌. మొత్తానికి ఏవీకి కూడా నామినెటేడ్ ప‌ద‌వి అనేస‌రికి ఇప్పుడు ఏవీ వ‌ర్గం కూడా ఆనందంలో ఉంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.