అమ‌రావ‌తిలో ప‌ద‌వుల పండుగ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-11 17:49:10

అమ‌రావ‌తిలో ప‌ద‌వుల పండుగ?

ఎంతో కాలంగా ఊరిస్తున్న అమ‌రావ‌తి ప‌దవుల భ‌ర్తీ జ‌రిగిపోయింది.. ఎన్నో రోజులుగా అల‌క‌లు బూనిన నాయ‌కులు ఇప్పుడు కాస్త స్దిమితంగా ఉన్నారు... ఈ ప్ర‌త్యేక హూదా  సెగ స‌మ‌యంలో ఇటు చంద్ర‌బాబు మంచి డెసిష‌న్ తీసుకున్నారు అని నాయ‌కులు అంటున్నారు...కొన్ని రోజులు ఇలా డైవ‌ర్ట్ చేయ‌వ‌చ్చు అని త‌మ్ముళ్లు సంతోషంలో ఉన్నార‌ట‌.  రాజ‌ధానినే కాదు రాజ‌ధాని ప్రాంత నాయ‌కుల‌కు నామినేటెడ్ ప‌ద‌వుల్లో అగ్ర‌తాంబూలం ఇచ్చారు అని కొంద‌రు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.
 
గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఎస్‌ఎం జియావుద్దీన్‌, దాసరి రాజా మాస్టర్‌లకు సముచిత స్థానం కల్పిస్తూ పార్టీ అధిష్ఠానం రాష్ట్ర స్థాయి చైర్మన్‌ పదవులు కేటాయించింది... గుంటూరు జిల్లా పెదనందిపాడుకు పోలినేని అంకమ్మచౌదరికి శాప్‌ చైర్మన్‌గా అవకాశం ఇచ్చారు.. అలాగే కీలకమైన రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పదవిని ఎవరూ ఊహించని విధంగా దాసరి రాజా మాస్టర్‌కు అప్పగించారు.. జియావుద్దీన్‌కు ఏపీ మైనార్టీ కమిషన్‌ చైర్మన్‌గా నియమించింది
 
ఎంపీ రాయపాటికి అనుచరుడిగా ఉన్న హిదాయత్‌కు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవిని కొనసాగించింది. రెండేళ్ల క్రితం రెండో సారి కూడా అదే పదవిని హిదాయత్‌కు అప్పగించింది.కొన్ని నెలల క్రితం ఈ పదవి కాలం ముగియగా మరోసారి ఆయనకే అవకాశం కల్పిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఏపీ మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా షేక్‌ లాల్‌ వజీర్‌ తిరిగి నియమితులయ్యారు.
 
అలాగే టీడీపీ సీనియర్‌ నేతలకు కీలక పదవులు ఇచ్చారు బాబు ....ఆర్టీసీ చైర్మన్‌గా వర్ల రామయ్య కు అవ‌కాశం ఇచ్చారు...టీటీడీ చైర్మన్ ప‌ద‌విని అంద‌రూ అనుకున్న విధంగానే యనమల రామకృష్ణుడి వియ్యంకుడు, మైదుకూరు టీడీపీ నేత పుట్టా సుధాకర్‌ యాదవ్‌కు ఇవ్వ‌డం జ‌రిగింది... ఇక వైసీపీ నుంచి టీడీపీలోకి రీ ఎంట్రీ ఇచ్చిన టీడీపీ మాజీ మంత్రి న‌ర‌సాపురం లీడ‌ర్ కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడికి కాపు కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌వి అప్ప‌గించారు...మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి సోదరుడు కిశోర్‌ కుమార్‌ రెడ్డికి స్టేట్ ఇరిగేషన్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పదవిని చంద్రబాబు ఇచ్చారు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.