న్యాయం కోరితే దేశ ద్రోహ‌మా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-31 15:56:12

న్యాయం కోరితే దేశ ద్రోహ‌మా

ముస్లిం యువ‌కుల‌ను ఏపీ స‌ర్కార్ క‌క్ష‌సాధింపున‌కు ఇది ప‌రాకాష్టా. స‌భ‌కు జ‌నం రాలేద‌న్న నెపంతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ముస్లిం యువ‌కుల‌పై త‌న కోపాన్ని చూపించారు. ఈ స‌భ‌లో త‌మ సమ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌మ‌ని ఫ్ల‌కాడ్స్ ప‌ట్టుకుని ప్ర‌ద‌ర్శించిన పాపానికి టీడీపీ స‌ర్కార్ వారికి చుక్కలు చూపించారు. అరెస్టు చేసిన వారిని స్టేష‌న్లకు తిప్పి, తిప్పి పోలీసులు లాఠీల‌కు ప‌ని చెప్పారు. 
 
ఇక చివ‌రికి మీడియా క‌థ‌నాల‌కు స్పందించి ఆ తొమ్మిది మంది ముస్లిం యువ‌కుల‌ను అరెస్ట్ చేసిన‌ట్లు ప్ర‌క‌టించి మెజిస్ట్రేట్ ముందు హాజ‌రు ప‌రిచారు. అంత‌టితో ఆగ‌కుండా పోలీసులు రాసిన రిమాండ్ రిపోర్ట్ లో ఆ తొమ్మిదిమంది యువ‌కుల‌పై దారుణ‌మైన ఆరోప‌ణ‌లు చేశారు. ప్ర‌ధాన నిందితుడు అయిన హాబీబుల్లాతో పాటు మిగతా ఎనిమిది మంది యువ‌కులు కూడా సోష‌ల్ డెమోక్ర‌టిక్ పార్టీ ఆఫ్ ఇండియా నే పార్టీలోని స‌భ్యుల‌ని పేర్కొన్నారు. 
 
అంతేకాదు వీరంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఫాలోవ‌ర్స్ అంటూ ప్ర‌తిపక్ష‌ పార్టీకి లింక్ పెట్టే ప్ర‌య‌త్నం చేశారు. అయితే వీరంతా చాలా కాలంగా ప్ర‌త్యేక దేశం కావాలని కోరుకుంటున్నార‌ని ఆ రిమాండ్ రిపోర్ట్ లో పొందుప‌రిచారు. జ‌నంలో బ‌యాందోళ‌న‌ను క‌లిగించ‌డ‌మే కాకుండా టెర్ర‌రిజం సృష్టించ‌డానికి కుట్ర ప‌న్నుతున్నార‌నే అభియోగాన్ని చూపింది. వీరంద‌రూ చాలా రోజులుగా అవ‌కాశం కోసం ఎదురు చూస్తున్నార‌ని ఈ స‌మ‌యంలోనే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం రాష్ట్రవ్యాప్తంగా ముస్లిం స‌భ నిర్వ‌హిస్తున్నార‌ని ఆ రిపోర్టులో పేర్కొన్నారు. 
 
దీంతో మొద‌టి ముద్దాయిగా ఉన్న హామీబుల్లా మిగతా వారంద‌రిని చేర‌దీసి చంద్ర‌బాబు నాయుడు పాల్గొనే ఆ స‌భ‌లో టెర్ర‌ర్ సృష్టించాల‌ని భావించార‌ట‌. ఈ నేప‌థ్యంలో  విద్యార్థుల‌కు బ‌స్ పాస్ లు, స్కాల‌ర్ షిప్ లు ఎక్క‌డ.. నాలుగు జిల్లాలు ఉర్దూ మీడియం స్కూల్స్ ఎక్క‌డా ..హిమామ్ గౌర‌వవేత‌నం ఎక్క‌డ అంటూ ప్ల‌కార్డుల‌ను సిద్దం చేసుకున్నార‌ట‌. త‌ర్వాత 27న రాత్రి నంద్యాల‌లో రైలు ఎక్కి 28 ఉద‌యం ఎనిమిది గంట‌ల‌కు స‌భ‌కు చేరుకున్నార‌ని అలా అనేక ఆరోప‌ణ‌ల‌తో రిమాండ్ రిపోర్ట్ ను త‌యారు చేసి వారిని రిమాండ్ కు త‌ర‌లించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.