నన్ను ప్ర‌శ్నిస్తే ప్ర‌తి ఒక్క‌రి ఈ గ‌తే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu naidu
Updated:  2018-08-30 01:17:05

నన్ను ప్ర‌శ్నిస్తే ప్ర‌తి ఒక్క‌రి ఈ గ‌తే

నారా హమారా, టీడీపీ హ‌మారా స‌భ‌లో నిర‌స‌న‌ను వ్య‌క్తం చేసిన ముస్లిం వ్య‌క్తుల ప‌ట్ల టీడీపీ వ్య‌వ‌హ‌రించిన తీరు ప్ర‌స్తుతం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ స‌భ‌లో తొమ్మిది మంది యువ‌కులను అరెస్ట్ చేసిన విష‌యాన్ని దాచిపెట్టి వారిని నిర్భందించి హైడ్రామా ఆడారు. అరెస్ట్ అయిన వారిన పోలీసులు వేదించి రాత్రి స‌మ‌యంలో ఎవ్వ‌రు చూడ‌కుండా అరెస్ట్ చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు. 
 
2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌మ‌ని నంద్యాల నుంచి వ‌చ్చిన ముస్లిం యువ‌కులు స‌భ‌లోనే ప్ల‌కాడ్స్ ద్వారా నిర‌స‌న‌ను వ్య‌క్తం చేశారు. టీడీపీ హ‌యాంలో ముస్లింల‌ను ఎందుకు ప్రోత్స‌హించ‌డం లేద‌ని అలాగే వ‌క్ఫ్ బోర్డు భూముల అన్య‌క్రాతం అవుతున్న అధికారులు ప‌ట్టించుకోవ‌టం లేదని స‌భా ముఖంగా నిల‌దీయ‌టంతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు రెచ్చిపోయి త‌న స‌భ‌లో రెచ్చిపోయిన వారిని అరెస్ట్ చేయించారు. 
 
దీంతో త‌మ వారు ఎక్క‌డ ఉన్నారో నంద్యాల‌నుంచి వ‌చ్చిన మ‌రికొంత ముంది ముస్లిం సోద‌రులు ఆందోళ‌న చెందారు. ఇక ఈ వ్య‌వ‌హారం పెద్ద‌ది కావ‌డంతో వారిని వెంట‌నే కోర్టులో హ‌జ‌రుప‌ర‌చాల‌ని ఆదేసించ‌డంతో చీక‌ట్లో అరెస్ట్ చేసిన‌ట్లు ప్ర‌క‌టించి రిజిస్ట్రేట్ ముందు హ‌జ‌రు ప‌రిచారు. దీంతో చంద్ర‌బాబు ముస్లిం యువ‌కుల‌పై ప్ర‌వ‌ర్తించిన తీరుపై మైనార్టీలు తీవ్రంగా ర‌గిలిపోతున్నారు. 
 
మైనార్టీల‌కు అండ‌గా ఉంటాన‌ని స‌భా ముఖంగా ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు ఆ మ‌రు క్ష‌ణ